E-Paper
Advertisement

వారణాసి షూటింగ్.. మహేష్ బాబు సీన్ లీక్.. వీడియో వైరల్

వారణాసి షూటింగ్.. మహేష్ బాబు సీన్ లీక్.. వీడియో వైరల్
Advertisement

Varanasi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న రాజమౌళి (Rajamouli) ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి(Varanasi). గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu ) లీడ్ రోల్ పోషిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కుంభ అనే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.

వారణాసి అప్డేట్స్ కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూపు..

సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది కానీ సినిమా నుంచి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అప్పుడెప్పుడో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం.. ఆ తర్వాత ఒక చిన్న టీజర్ ను వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు.పోతే అప్పుడప్పుడు సినిమా గురించి ప్రస్తావిస్తున్నారు కానీ సినిమా నుంచి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు అసలు ఏం జరుగుతుంది? సినిమా షూటింగ్ ఎక్కడ వరకు వచ్చింది? అసలు ఎలా ఉండబోతోంది? అంటూ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వారణాసి మూవీ నుండి మహేష్ సీన్ లీక్..

Advertisement

ఇలాంటి సమయంలో చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరుస్తూ.. మహేష్ బాబు సీన్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లీకైన వీడియో విషయానికి వస్తే.. వారణాసి సెట్ వేయగా.. యాక్షన్ సీన్ తర్వాత.. గాయపడిన మహేష్ బాబు అప్పుడే గంగానదిలో దిగుతున్నట్టుగా ఒక సీన్ కు సంబంధించిన వీడియో లీక్ అయింది. ఇందులో మహేష్ బాబు ముఖం మొత్తం రక్తంతో తడిసిపోయినట్టుగా మనం చూడవచ్చు. క్యాజువల్ లుక్ లో ముఖం నిండా గాయాలతో మహేష్ బాబు కనిపించడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లీకైన ఈ వీడియో పై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర నటి?

వారణాసి మూవీ విశేషాలు..

Advertisement

వారణాసి సినిమా విషయానికి వస్తే.. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై డాక్టర్ కే ఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇకపోతే గత ఏడాది నవంబర్ 15న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ను నిర్వహించగా.. అందులో మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ ను రివీల్ చేశారు. అలాగే ఒక ఎద్దు పైనుంచి మహేష్ బాబును దింపుతూ రియలిస్టిక్ గా చేసిన ఈ స్టంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

 

Related News

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

Big Stories

Advertisement
×