E-Paper
Advertisement

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ!

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ!
Advertisement

Patient Pension: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిడ్ బాధితులకు, డయాలసిస్ రోగులకు ప్రతి నెలా పెన్షన్ అందజేస్తుంది. అయితే ఈనెల 15 నుంచి తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేయాలనిప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అర్హుల జాబితాను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో బాధితులకు పింఛన్ తో ఆర్ధిక చేయూత కలుగుతుంది.

సుమారు 10 వేలు..

ఆర్థిక చేయూత కోసం గత కొంతకాలంగా తలసేమియా, సికిల్‌సెల్ బాధితులు ఎదురుచూస్తున్నారు. బాధితులు దరఖాస్తులు చేసుకున్నారు. అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాణాధార వ్యాధులతో బాధపడుతున్న బాధితుల సంఖ్య సుమారు 10 వేల వరకు ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

5వేలకు పైగా..

Advertisement

రాష్ట్రంలోని ఉమ్మడిఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా పౌష్టికారం లోపంతో బాధపడుతున్నారు. అయితే వారిని అధికారులు గుర్తించారు.ఇంకా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. వారికి పింఛన్ అందిస్తే ఆర్థికంగా చేయూతతో పాటు పోషకాహారం అందించవచ్చనిప్రభుత్వం బావిస్తుంది. అందుకు ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ఇప్పటికే 5వేలకు పైగా సికిల్ సెల్ బాధితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేయనున్న వివిధ రకాల పింఛన్లతో పాటు ఈ తలసేమియా, సికిల్‌సెల్ బాధితుల దరఖాస్తులను కూడా స్వీకరించి మంజూరు చేయబోతున్నారు.

ప్రతిపాదనలు సిద్దం

మీసేవ కేంద్రాలతో పాటు మండల కార్యాలయాల్లోనూ దరఖాస్తుల స్వీకరణకు వెసులుబాటు కల్పించబోతున్నారు. అందుకు సంబంధించిన ఫారాలతో పాటు ఏ వ్యాధితో బాధపడుతున్నాడో ఆ వివరాలను దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను బట్టి ప్రభుత్వం ఆసరా పథకం కింద పించన్ 2016 అందజేయనున్నది. ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా వాటిని పరిశీలిస్తుంది.

ఆగస్టు 15 నుంచే పంపిణీకి శ్రీకారం

Advertisement

తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం నాటి నుంచే ఈ కొత్త పింఛన్ల పంపిణీని అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో సుమారు 10వేల మందికి ఆర్థిక భరోసా కలుగనుంది.

Also Read: తొలిసారి స్క్రీన్ పంచుకోబోతున్న తండ్రీ కొడుకు..’బరి’లోకి నాగబాబు!

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×