E-Paper
Advertisement

రావు రమేష్ కి సినిమా అవకాశాలు తగ్గడానికి గల కారణం ఏంటంటే?

రావు రమేష్ కి సినిమా అవకాశాలు తగ్గడానికి గల కారణం ఏంటంటే?
Advertisement

Actor Rao Ramesh: రావు రమేష్.. విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఎవరో కాదు రావు గోపాల్ రావు కుమారుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన ..ఇండస్ట్రీలోకి రాకముందు స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలని ఎంతగానో కలలు కన్నారట. కానీ విధి ఆయనను ఇండస్ట్రీ వైపు నడిపించింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో గమ్యం సినిమాలో నక్సలైట్ పాత్ర పోషించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈయన నటించిన సినిమాల విషయానికి వస్తే.. సీమ సింహం, ఆంధ్రుడు, ఒక్కడున్నాడు , కొత్త బంగారులోకం, ఆవకాయ బిర్యానీ, దొంగల బండి ,ఫిట్టింగ్ మాస్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ముఖ్యంగా ఏడాదికి ఐదు నుండి 8చిత్రాలు విడుదల చేస్తూ మరింత పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే.

రావు రమేష్ సినిమాలు తగ్గించారా?

ముఖ్యంగా ఏ పెద్ద సినిమా విడుదలైనా ప్రతి వారంలో కూడా రెండు సినిమాలలో ఆయన మినిమం కనిపించే వారనే పరిశీలన కూడా చాలా వరకు నిజం. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలలో కనిపించే సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు అన్ని సినిమాలలో నటించిన రావు రమేష్ ఇప్పుడు ఉన్నట్టుండి కనిపించకపోవడానికి గల కారణం ఏమిటి ? నిజంగానే ఆయన సినిమాలు తగ్గించారా ?లేక ఆయన వద్దకు సినిమాలు రావడం లేదా? ఇండస్ట్రీలోకి కొత్తనీరు వస్తే పాత నీరు పోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. బహుశా ఆయన లాంటి నటీనటులు ఇండస్ట్రీలో ఉండడం వల్లే ఆయనకు అవకాశాలు తగ్గిపోతున్నాయా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అవకాశాలు తగ్గడానికి ప్రధాన కారణం?

Advertisement

రావు రమేష్ కి అవకాశాలు తగ్గడానికి ప్రధానంగా రెమ్యూనరేషన్, పాత్రల ఎంపిక వంటి అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆయన తన స్థాయికి తగ్గ పారితోషకం ఆశిస్తుండడం వల్ల చిన్న, మధ్యతరహా బడ్జెట్ నిర్మాతలు ఇతర ప్రత్యామ్నాయ నటులను ఎంచుకుంటుండవచ్చు. అలాగే ఆయన ఆటిట్యూడ్ మారిందనే ప్రచారంలో ఎలాంటి అధికారిక నిజం లేనప్పటికీ రొటీన్ పాత్రలకు బదులుగా వైవిధ్యమైన, తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల కూడా కొన్ని ఆఫర్లు దూరమవుతున్నాయనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

also read: అనడానికి ఏం అర్హత ఉంది.. బాడీ షేమింగ్ ట్రోల్స్ పై పాయల్ స్ట్రాంగ్ కౌంటర్!

మళ్లీ రావాలని ఆకాంక్షిస్తున్న అభిమానులు..

Advertisement

దీనికి తోడు గతంలో వరుసగా ఒకేలాంటి పాత్రలు చేయడం వల్ల దర్శక నిర్మాతలు కొంత గ్యాప్ ఇవ్వడం, కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టులు అందుబాటులోకి రావడం కూడా కారణం కావచ్చు. ఏదేమైనా రావు రమేష్ లాంటి అద్భుతమైన నటుడు తెరపై తక్కువగా కనిపించడం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే కాబట్టి త్వరలోనే ఆయన మళ్లీ మరింత బలమైన పాత్రలతో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని మనం కూడా ఆశిద్దాం..

Related News

జైలర్ 2 విలన్ భార్య ఎవరో తెలిస్తే షాక్!

అనడానికి ఏం అర్హత ఉంది.. బాడీ షేమింగ్ ట్రోల్స్ పై పాయల్ స్ట్రాంగ్ కౌంటర్!

ఆదర్శ కుటుంబం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..ఎప్పుడు? ఎక్కడంటే?

బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన నటి వితికా షేర్… తొలి అడుగు అంటూ!

చిన్న కూతురి పేరు రివీల్ చేసిన దీపిక పదుకొనె… ఫోటో వైరల్!

నిన్న ఫౌజీ.. నేడు స్పిరిట్ వాయిదాల దిశగా ప్రభాస్ సినిమాలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

నేను చనిపోయాకా నా ఆస్తి మొత్తం వాళ్ళకే… రజినీకాంత్ షాకింగ్ డేసిషన్!

Big Stories

Advertisement
×