E-Paper
Advertisement

విజయవాడలో భారీగా బంగారం.. విదేశీ నోట్ల కట్టలు, అధికారులకు చిక్కిన ఐదుగురెవరు? దీని వెనుక

విజయవాడలో భారీగా బంగారం.. విదేశీ నోట్ల కట్టలు, అధికారులకు చిక్కిన ఐదుగురెవరు? దీని వెనుక
Advertisement

Vijayawada: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి తీవ్రమైంది. ఈ సమయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. ఇంతకీ ఇది ఎవరి పని? దీనికి వెనుక రాజకీయాలు నేతలు ఉన్నారా? గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగులు ఉన్నాయా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అసలు ఏం జరిగింది?

కోల్‌కత్తా టు హైదరాబాద్ కు బంగారం స్మగ్లింగ్

దేశంలో బంగారం స్మగ్లర్లు రూటు మార్చారు. ఈ మధ్యకాలంలో కోల్‌కత్తా టు చెన్నై ఎన్‌హెచ్-5 జాతీయ రహదారిని ఎంచుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కత్తాకు తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు లేకుంటే విదేశాలకు తరలిస్తున్నారు. మూడు వారాల కిందట విశాఖ సిటీలో కూడా కోల్‌కత్తా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ కారుని తనిఖీలు చేశారు డీఆర్ఐ అధికారులు. అందులో దాదాపు 5 కేజీల వరకు బంగారం పట్టుబడింది. కారులోని ఫ్రంట్ సీటు కిందట పెట్టి బంగారం అక్రమంగా తరలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని డీఆర్ఐ అధికారులు విచారణ చేపట్టారు.

విజయవాడ-హైదరాబాద్ మధ్య అధికారులు భారీ ఆపరేషన్

Advertisement

ఈ ఘటన జరిగి మూడు వారాల తర్వాత ఇప్పుడు విజయవాడ వంతైంది. తాజాగా విజయవాడ సిటీ శివారులో భారీగా విదేశీ బంగారం, విదేశీ కరెన్సీని సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు. మార్కెట్లో వీటి విలువ అక్షరాలా రూ.5.84 కోట్లు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారం అక్రమంగా తరలించే క్రమంలో పట్టుబడినట్టు తెలుస్తోంది. విజయవాడ శివార్లలో స్కార్పియో వాహనాన్ని అడ్డగించిన అధికారులు, వాహనాన్ని అన్ని కోణాల్లో తనిఖీలు చేయగా రహస్య అరలో విదేశీ కరెన్సీ గుర్తించారు.

అందులో 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విక్రయించగా వచ్చిన సొమ్ముగా విదేశీ కరెన్సీ గుర్తించారు అధికారులు. పట్టుబడిన బంగారం 3.14 కేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని అదుపులోని తీసుకుని తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? మిమ్మల్ని ఫాలో అవుతున్నదెవరు? రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

ALSO READ: సిక్కోలులో టీడీపీకి ఊహించని షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మి, ధర్మాన వ్యూహం సక్సెస్

ఇదిలావుండగా హైదరాబాద్ వైపు వస్తున్న బస్సులో డీఆర్ఐ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓ స్మగ్లింగ్ ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. టోల్‌ప్లాజా వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నడుముకు కట్టుకున్న పౌచ్‌లో బంగారం బార్లు దాచినట్టు తేలింది. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు అధికారులు. ఈ ఆపరేషన్‌ను హైదరాబాద్ యూనిట్-విజయవాడ రీజినల్ యూనిట్ సమన్వయంతో ఆపరేషన్ చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై అధికారులు గట్టి నిఘా పెట్టారు.

Related News

సిక్కోలులో టీడీపీకి ఊహించని షాక్.. రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మి, ధర్మాన వ్యూహం సక్సెస్

కార్పొరేషన్లలో లెక్కలు తేలాయి.. ఊపిరి పీల్చుకున్న కూటమి నేతలు, ఎక్కడెక్కడ ఎన్ని?

వైసీపీలో ఏం జరిగింది? జగన్ పులివెందుల టూర్ క్యాన్సిల్? బెంగుళూరు నుంచి విజయవాడకు

చల్లటి కబురు వచ్చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం? కొద్ది గంటల్లో భారీ వర్షాలు

బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

అక్రమ నగదుపై పోలీసుల నిఘా.. రూ. 42 లక్షలు సీజ్ చేసిన ఆత్మకూరు డీఎస్పీ

దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!

Big Stories

Advertisement
×