E-Paper
Advertisement

I Bomma Trolling: I-బొమ్మస్థానంలో J-బొమ్మ, N-బొమ్మ.. ఇప్పుడివే హాట్ టాపిక్

I Bomma Trolling: I-బొమ్మస్థానంలో J-బొమ్మ, N-బొమ్మ.. ఇప్పుడివే హాట్ టాపిక్
Advertisement

సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఐ బొమ్మ హాట్ టాపిక్ గా ఉంది. ఇమ్మడి రవి అలియాస్ ఐ బొమ్మ రవి సంచలనంగా మారిపోయాడు. టాలీవుడ్ దృష్టిలో అతను ఓ విలన్. అయితే ఓ వర్గం మాత్రం అతడిని సోషల్ మీడియాలో హీరోలాగా పొగిడేస్తోంది. పైగా రవి వర్గం అతడి వ్యతిరేక వర్గానికి సోషల్ మీడియాలో వార్ కూడా నడుస్తోంది. ట్రెండింగ్ టాపిక్ లను పట్టుకుని విమర్శలు ఎక్కుపెట్టుకోవడంలో ఏపీ రాజకీయ పార్టీలు ఫుల్ అప్డేట్ గా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రెండు కొత్త బొమ్మలు మొదలయ్యాయి. ఒకటి J-బొమ్మ ఇంకొకటి N-బొమ్మ.

ముందుగా J-బొమ్మ
I-బొమ్మ ట్రెండ్ తో జగన్ ని టార్గెట్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. J-బొమ్మ అంటూ వైసీపీని రెచ్చగొట్టింది. J-బొమ్మ J లెటర్ ని కూడా గొడ్డలి టైప్ లో డిజైన్ చేశారు. ఇక జగన్ ఫొటోని టీవీలో ఉండేలా చేసి, కింద వివేకా హత్య, కోడికత్తి, గులకరాయి, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం, రుషికొండ బాత్ టబ్ ని కూడా డిజైన్ చేశారు. పరకామణి చోరీ వ్యవహారంలో జరిగిన టీటీడీ మాజీ ఏవీఎస్వో రవి కుమార్ హత్యోదందాన్ని కూడా ఇందులో కవర్ చేశారు.

Advertisement

N-బొమ్మ..
టీడీపీ ఇచ్చిన కౌంటర్ కి వైసీపీ కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయింది. వైసీపీ కూడా N-బొమ్మ పేరుతో మరో డిజైన్ ని తయారు చేయించింది. ఇందులో వీళ్లు N అనే లెటర్ ని కత్తులతో డిజైన్ చేశారు. ఎన్టీఆర్ ఫొటోని, వైఎస్ రాజారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి ఫొటోల్ని కూడా హైలైట్ చేస్తూ చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఈ రెండు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు J-బొమ్మని హైలైట్ చేస్తూ కామెంట్లు పెడుతుంటే.. అటు వైసీపీ మద్దతుదారులు N-బొమ్మ.. అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు.

Advertisement

ట్రోలింగ్ లో అప్డేట్..
ఏపీలో రాజకీయ పార్టీలు ట్రోలింగ్ లో బాగా అప్ డేట్ గా ఉంటున్నాయి. అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ఈ వార్ జోరుగా సాగుతోంది. తాజాగా ఐ బొమ్మ ట్రెండ్ ని టీడీపీ, వైసీపీ రెండూ బాగా ఉపయోగించుకున్నాయి. ఎన్నికలై ఏడాదిన్నరే అవుతున్నా, మరో మూడున్నరేళ్లకు ఎన్నికలొస్తాయని తెలిసినా ఏపీలో మాత్రం రేపోమాపో ఎన్నికలు అన్నట్టుగా ఉంది పరిస్థితి. రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అయితే ఈ ట్రెండ్ లో జనసేన, బీజేపీ చేరకపోవడం విశేషం. వైసీపీ తన ప్రధాన ప్రత్యర్థిగా టీడీపీనే టార్గెట్ చేస్తోంది. జనసేనపై విమర్శలు చేసినా, పవన్ కల్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించినా ప్రజలు హర్షించడం లేదని వైసీపీ నేతలు ఫిక్స్ అయినట్టున్నారు. అందుకేవారు టీడీపీని, అందులోనూ నారా లోకేష్ ని బాగా ఫోకస్ చేస్తున్నారు. జగన్ ని టార్గెట్ చేస్తే మాత్రం బదులుగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కార్టూన్లు వదులుతున్నారు.

Also Read: ఎన్డీఏలో కీలకంగా లోకేష్.. బీహార్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×