E-Paper
Advertisement

Mokshagna Debut: 31 ఏళ్ల నందమూరి వారసుడు.. ఇంకా డెబ్యూ లేదు..మోక్షజ్ఞ విషయంలో ఏం జరుగుతోంది..?

Mokshagna Debut: 31 ఏళ్ల నందమూరి వారసుడు.. ఇంకా డెబ్యూ లేదు..మోక్షజ్ఞ విషయంలో ఏం జరుగుతోంది..?
Advertisement

Mokshagna Debut: నందమూరి అభిమానులే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులు కూడా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈయన్ని స్క్రీన్ పైన చూస్తామా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ కుమారుడిగా ఆయన సినీ ఎంట్రీపై చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా మొదలుకాలేదు. అందుకే మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా తెరపైకి వస్తాడన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది.

వయసు కూడా ఎక్కువే..!

సాధారణంగా హీరోల వారసులు 22–25 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చేస్తారు. మొదట లవ్ స్టోరీలు చేసి, తర్వాత యాక్షన్ సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తారు. కానీ మోక్షజ్ఞ మాత్రం 31 ఏళ్ల వయసు వచ్చినా.. ఇంకా కెమెరా ముందుకు రాలేదు. అనుకున్న ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒక కారణంతో ఆగిపోతోంది. ఆ కారణం కూడా బయటపడడం లేదు.

మొదటినుంచి అంటే సంగతి..!

Advertisement

మొదట హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. ఫోటోలు కూడా విడుదలయ్యాయి. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి రాకముందే క్యాన్సిల్ అయింది. తర్వాత బాలయ్య తన అన్‌స్టాపబుల్ షోలో ఆదిత్య 369 సీక్వెల్ – ఆదిత్య 99 మ్యాక్స్ అంటూ మరో పెద్ద అనౌన్స్‌మెంట్ చేశారు. ఇందులో మోక్షజ్ఞ లీడ్‌గా ఉంటాడని చెప్పారు. దీంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి.

కానీ ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పటివరకు మొదలుకాలేదు. కథ, దర్శకుడు, బడ్జెట్ విషయాల్లో క్లారిటీ రాకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మొదట ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆయన కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో భారీ బడ్జెట్ అవసరం అవుతుందని, ఆ రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారని టాక్.

Advertisement

ఇన్ని ఏళ్లుగా సినిమాలపై వార్తలు వచ్చినా ఒక్కటి కూడా వర్కవుట్ కాకపోవడంతో నందమూరి అభిమానులు కూడా మెల్లగా ఆసక్తి తగ్గించుకుంటున్నారు. యాక్టింగ్‌పై నిజంగా ఆసక్తి ఉంటే అవకాశాలు రావడం పెద్ద కష్టం కాదు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

ఇప్పటికే 30 ప్లస్ వయసులోకి వచ్చిన మోక్షజ్ఞ అసలు ఏ వయసులో హీరోగా పరిచయం అవుతాడో అన్నది ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న పెద్ద ప్రశ్న. భవిష్యత్తులో అయినా స్పష్టమైన నిర్ణయం తీసుకుని అభిమానుల ఆశలు నెరవేర్చుతాడేమో చూడాలి.

ALSO READ: Yash Toxic: యశ్ టాక్సిక్ ముందు సవాలక్ష అడ్డంకులు.. విడుదల వాయిదా పడేనా?

Related News

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను ఇష్టపడే హీరో అతనేనా? అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ!

సంక్రాంతి తప్ప వేరే డేట్ కనిపించలేదా? మెగా హీరో సినిమాకు బెదిరింపు ఫోన్ కాల్స్?

‘నల్లమల’ డైరెక్టర్ రవి చరణ్ కొత్త మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్.. వారే టార్గెట్ గా!

విశ్వక్ సేన్ ఎదురుగా లైవ్‌లో వ్యక్తిని షూట్ చేసిన యాంకర్, అతడి పరిస్థితి ఎలా ఉందంటే?

ఆ భయమే నన్ను వెంటాడుతోంది.. రష్మిక బ్రతిమలాడడంపై విజయ్ షాకింగ్ రియాక్షన్!

నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి.. జాన్వీ వివాదంపై రష్మిక రియాక్షన్!

మెగా హీరో చేసుకోబోయే అమ్మాయి ఈమెనా..?

వియత్నాం ట్రిప్ ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న మినాక్షి

Big Stories

Advertisement
×