E-Paper
Advertisement

77th Republic Day Parade: భారత ఆర్మీలో నాలుగు కాళ్ల యోధులు.. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యేక ఆకర్షణ

77th Republic Day Parade: భారత ఆర్మీలో నాలుగు కాళ్ల యోధులు.. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యేక ఆకర్షణ
Advertisement

77th Republic Day Parade: దేశ రాజధాని దిల్లీలో 77వ గణతంత్ర వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు జరిగింది. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రిపబ్లిక్ డే పరేడ్ లో శకటాలు, హెలికాఫ్టర్ విన్యాసాలు, సైనికుల కవాతు ఆకట్టుకున్నాయి.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ కవాతులో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. ఇండియన్ ఆర్మీ బలగాలు తమ జంతు బృందాలతో కలిసి మొదటిసారిగా కర్తవ్యపథ్ కవాతులో పాల్గొన్నాయి. కఠిన భూభాగాల్లో సైనికులకు సాయం చేయడంతో జంతువుల కీలక పాత్రను హైలైట్ చేశారు. ఆర్మీ రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ జంతు బృందంతో కవాతులో పాల్గొన్నారు.

జంతు బృందాల ప్రధాన ఆకర్షణ

Advertisement

గల్వాన్, నుబ్రాకు చెందిన బాక్టీరియన్ ఒంటెలు రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఒంటెలు ప్రతికూల వాతావరణంలో 15,000 అడుగుల ఎత్తులో 200 కిలోల బరువును మోస్తాయి. అంతరించిపోతున్న స్వదేశీ జంస్కారి పోనీస్ గుర్రాలు కూడా మొదటిసారిగా కర్తవ్యపథ్ కవాతులో పాల్గొన్నాయి. సరిహద్దుల్లో గస్తీ కాసే సైనికులకు ఇవి సాయంగా ఉంటాయి.

బాక్ట్రియన్ ఒంటెలు

రెండు బాక్ట్రియన్ ఒంటెలు, నాలుగు జాంస్కర్ పోనీస్ గుర్రాలు, నాలుగు రాప్టర్ గ్రద్ధలు, పది ఆర్మీ శునకాలు పరేడ్ లో పాల్గొన్నాయి. లడఖ్‌లోని మంచు ఎడారి ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించడానికి బాక్ట్రియన్ ఒంటెలు ఉపయోగిస్తారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, 15,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో కూడా ఈ ఒంటెలు 250 కిలోల వరకు బరువును మోయగలవు. తక్కువ నీరు, ఆహారంతో ఎక్కువ దూరం ప్రయాణించగలవు. వీటి సాయంతో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద లాజిస్టిక్స్, గస్తీ సామర్థ్యాలను ఆర్మీ బలోపేతం చేసింది.

జాంస్కర్ పోనీలు

Advertisement

లడఖ్‌కు చెందిన స్వదేశీ గుర్రపు జాతికి చెందిన జాంస్కర్ పోనీలు రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నాయి. పోనీలు పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌లో ఎత్తైన ప్రదేశాలలో 40 నుండి 60 కిలోల బరువును మోయగలవు. 2020 నుంచి పోనీలు ఇండియన్ ఆర్మీలో భాగమయ్యాయి. అవి సియాచిన్ సహా కఠినమైన ప్రదేశాలలో వీటిని ఉపయోగిస్తారు. బరువులు మోయడానికి, సుదూర ప్రాంతాలలో మౌంటెడ్ పెట్రోలింగ్ కోసం ఉపయోగిస్తారు.

Also Read: ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ఆకట్టుకున్న సైనికుల విన్యాసాలు, పాక్‌కు చెమటలు పట్టించినవి అవే

రాప్టర్ గ్రద్ధలు, స్వదేశీ శునకాలు

నాలుగు రాప్టర్‌లను.. ఆర్మీ బర్డ్-స్ట్రైక్ నియంత్రణ, నిఘా కోసం ఉపయోగిస్తుంది. కర్తవ్యపథ్ కవాతులో ఇవీ పాల్గొ్న్నాయి. పరేడ్ లో ముఖ్యమైన హైలైట్ ఆర్మీ డాగ్‌లు. వీటిని ఆర్మీ “సైలెంట్ వారియర్స్” అని పిలుస్తారు. మీరట్‌లోని ఆర్వీసీ సెంటర్ లో వీటికి శిక్షణ ఇచ్చారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, పేలుడు పదార్థాల గుర్తింపు, ట్రాకింగ్, విపత్తు సమయాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లో భాగంగా సైన్యం ముధోల్ హౌండ్, రాంపూర్ హౌండ్, చిప్పిపరై, కొంబై, రాజపాళయం వంటి స్వదేశీ కుక్క జాతులను ఎక్కువగా ఉపయోగిస్తుంది. .

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×