E-Paper
Advertisement

Lokesh Kanagaraj: సెన్సార్ వల్లే 60 కోట్లు నష్టం.. కూలీ నష్టాలపై లోకేష్ కీలక కామెంట్స్!

Lokesh Kanagaraj: సెన్సార్ వల్లే 60 కోట్లు నష్టం.. కూలీ నష్టాలపై లోకేష్ కీలక కామెంట్స్!

Lokesh Kanagaraj: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) . ఖైదీ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తానేంటో నిరూపించుకున్న ఈయన.. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. అలా తన ఒక్కో సినిమాకి లింకు చేస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసారు. ఈ యూనివర్స్ లో భాగంగానే ఇప్పటికే ఖైదీ, విక్రమ్ సినిమాలకు కూడా లింకు చేస్తూ విడుదల చేశారు. అలా ఒక సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించారు లోకేష్ కనగరాజ్.

సెన్సార్ వల్లే మా చిత్రానికి నష్టం..

అలాంటి ఈయన గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth )తో ‘ కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై తాజాగా లోకేష్ కనగరాజ్ స్పందించారు. సాధారణంగా ఒక సినిమాకి ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వాలి అనేది ఆ సినిమా కథ, కంటెంట్ పైన ఆధారపడి ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏ సినిమా ఎలాంటి కథతో రాబోతోంది అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయా చిత్రాలకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు. అయితే సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ వల్లే తమ కూలీ సినిమాకి ఏకంగా 60 కోట్లు నష్టం వచ్చింది అని లోకేష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

60 కోట్ల మేరా నష్టం వాటిల్లింది..

లోకేష్ మాట్లాడుతూ.. “కూలీ సినిమాకి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం వల్లే మేము ఏకంగా 60 కోట్ల మేర నష్టపోయాము. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ , హింస కారణంగా సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి రావడానికి వెనుకాడారని తెలుస్తోంది. సెన్సార్ ఇచ్చిన ఈ ఏ సర్టిఫికేట్ వల్లే మా చిత్రానికి రూ.60 కోట్ల మేరా నష్టం వాటిల్లింది ” అంటూ లోకేష్ కనగరాజ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఆరు నెలల తర్వాత స్పందించిన లోకేష్ కనగరాజ్..

కూలీ సినిమా విషయానికొస్తే.. 2025 ఆగస్టు 14న విడుదల అయింది . సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. అలాగే ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే “మోనిక” అనే స్పెషల్ సాంగ్ చేసి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ట్రెండింగ్ లో నిలిచింది. ఇకపోతే గత ఏడాది ఆగస్టు 21 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటిటి వేదికగా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ..సినిమా వచ్చి దాదాపు 6 నెలల తర్వాత ఈ సినిమా నష్టం పై లోకేష్ స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

also read: Eesha Rebba: తరుణ్ భాస్కర్ తో పెళ్లి.. డేటింగ్ నిజమే అంటున్న ఈషా!

Related News

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

Big Stories

×