E-Paper
Advertisement

MSVPG Deleted Song: మన శంకర్ వరప్రసాద్‌లో రమణ గోగుల సాంగ్.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..

MSVPG Deleted Song: మన శంకర్ వరప్రసాద్‌లో రమణ గోగుల సాంగ్.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..
Advertisement

MSVPG Deleted Song:  సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిన విషయమే. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ అలానే అనిల్ రావిపూడి కామెడీ తో పాటు.. ఈ సినిమాలో పాటలు కూడా హైలెట్గా నిలిచాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో పాటలన్నీ మంచి హిట్ అందుకోగా.. ఒక పాటని మాత్రం అనిల్ రావిపూడి .. కంపోజ్ చేయించుకొని అలానే ఒక ఫేమస్ సింగర్ తో పాడించుకొని కూడా పక్కన పెట్టేసారంట.

అసలు విషయానికి వస్తే..ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమణ గోగుల. ఆయన పాటలు అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే కొంతకాలం తర్వాత రమణ గోగుల ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు. దీంతో ఆయన మళ్లీ ఎప్పుడు పాటలు పాడతారా అనే ఆసక్తి అభిమానుల్లో ఉండేది.

Advertisement

గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో రమణ గోగుల తిరిగి సింగర్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన పాడిన ‘గోదారి గట్టు మీద రామసిలకవే’ అనే పాట సూపర్ హిట్‌గా నిలిచింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌తో ట్రెండ్ అయింది. ఈ పాటతో రమణ గోగుల మళ్లీ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారారు.

ఈ విజయం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రమణ గోగుల మరో పాట పాడుతున్నారని వార్తలు వచ్చాయి. చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో ఆయన పాట ఉంటుందని ప్రచారం జరిగింది. భీమ్స్ ఇచ్చిన ట్యూన్‌కు రమణ గోగుల స్వరం అద్భుతంగా ఉండడంతో ఈ పాట కూడా చార్ట్‌బస్టర్ అవుతుందని అందరూ భావించారు. కానీ చివరకు ఆ పాట సినిమాలో చోటు దక్కలేదు.

Advertisement

ఈ విషయంపై తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, రమణ గోగులతో ఒక పాట రికార్డ్ చేశామని తెలిపారు. అయితే అది చాలా మెలోడీగా ఉండటంతో సినిమాకు ఓపెనింగ్ సాంగ్‌గా సరిపోలలేదన్నారు. మొదటి పాట అంటే ఎనర్జీ, ఊపు, జోష్ ఉండాలని, కానీ ఈ పాటలో ఆ వైబ్ కనిపించలేదని చెప్పారు. అందుకే ఆ పాటను పక్కన పెట్టి, దాని స్థానంలో హుక్ స్టెప్ ఉన్న పాటను ఉపయోగించామని వివరించారు. రమణ గోగుల పాడిన ఆ పాటను ప్రస్తుతం రిలీజ్ చేసే ఆలోచన లేదని, భవిష్యత్తులో మరో సినిమాలో వాడే అవకాశం ఉందని తెలిపారు.

రమణ గోగుల కేవలం సింగర్ లేదా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు. ఆయన ఒక వ్యాపారవేత్త కూడా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సోలార్ ఎనర్జీపై చదువుకున్న ఆయన, అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం పలు స్టార్టప్ కంపెనీలు ప్రారంభించి, వందల గ్రామాలకు సోలార్ లైట్లను అందించారు. సంగీతంతో పాటు సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా రమణ గోగుల గుర్తింపు పొందారు.

ALSO READ: Vijay Devarakonda Rashmika: ఘనంగా విజయ్, రష్మిక పెళ్లి.. హాజరైన సమంత, అల్లు అర్జున్..!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×