E-Paper
Advertisement

Poop Selling: ఆహా.. మలం అమ్ముకొని లక్షలు గడిస్తున్న యువకుడు, ఇంతకీ ఎవరు కొంటున్నారు?

Poop Selling: ఆహా.. మలం అమ్ముకొని లక్షలు గడిస్తున్న యువకుడు, ఇంతకీ ఎవరు కొంటున్నారు?
Advertisement

తెలివి ఉండాలే గానీ, కాశ్మీర్ లో మంచు అమ్మి.. రాజస్థాన్ లో ఇసుక అమ్మి డబ్బులు సంపాదించవచ్చు అంటారు. అచ్చంగా ఇలాంటి పనే చేశాడు ఓ యువకుడు. తన మలాన్ని అమ్మి ఏకంగా లక్షల రూపాయలు సంపాదించాడు. మలం అమ్మడం ఏంటి? డబ్బులు సంపాదించడం ఏంటి? అయినా అతడి మలాన్ని కొని ఏం చేస్తారు? అని ఆశ్చర్యపోకండి. ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మలాన్ని కొని ఏం చేస్తారంటే?

ఈ రోజుల్లో క్లోస్ట్రిడియోయిడ్స్ డిఫిసిల్ ఇన్ఫెక్షన్లతో చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారి పెద్ద పేగులోకి ఆరోగ్యకరమైన దాత నుంచి తీసుకున్న మలాన్ని పంపించి, రోగి ప్రాణాలను కాపాడుతారు. ఇదే తన పాలిట వరంగా మార్చుకున్నాడు కెనడాలోని చిల్లివాక్‌లో నివసించే ఓ యువకుడు. 2025లో తన మలం అమ్మడం ద్వారా ఏకంగా రూ.3.4 లక్షలు సంపాదించాడు. రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన మలం అమ్మకం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.

ఇప్పటి వరకు 400 మందికి మలం అందజేత 

Advertisement

ప్రస్తుతం మలం దాత వయసు 24 ఏళ్లు. మలం దానం చేసేందుకు కుటుంబం కూడా ఆయనకు సపోర్ట్ చేస్తుంది. వాస్తవానికి మలం దాత.. తాత చనిపోయే ముందు కూడా పెద్ద పేగు సమస్యను ఎదుర్కొని చనిపోయాడు. మిగతా వాళ్లు ఎవరూ తన తాత మాదిరిగా చనిపోకూడనే ఉద్దేశంతో ఆయన మలం దాతగా మారిపోయాడు. FMT కంపెనీకి అతడు తన మలాన్ని అందిస్తున్నాడు. దానిని ప్రత్యేక కంటైనర్లలోకి తీసుకుని, ప్రాసెస్ చేసి, రోగులకు అందించే వరకు ప్రత్యేక ఫ్రిజ్‌ లో నిల్వ చేస్తున్నాడు.

?

Advertisement

క్లోస్ట్రిడియోయిడ్స్ డిఫిసిల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులను కాపాడేందుకు  ఆయన మలాన్ని డాక్టర్లు ఉపయోగిస్తున్నారు. ఆ మలాన్ని రోగి పెద్ద పేగులోకి ప్రవేశపెట్టడం వల్ల  ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను పెంచి, సమస్యలను రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు, సదరు యువకుడు ఏకంగా 400 మందికి తన మలాన్ని అందించడాడు. వారి ప్రాణాలు నిలబడటంలో సాయపడ్డాడు.

మలం దాత ఏం చెప్పాడంటే?

తమకు మలం దానం చేసే ఈ ప్రత్యేకమైన అవకాశం అనుకోకుండా వచ్చినట్లు చెప్పాడు. “నేను ఒక రోజు వాకింగ్ కు వెళ్లాను. కమ్యూనిటీ బోర్డులో ఓ ప్రకటన కనిపించింది. అప్పుడే నేను కాంటాక్ట్ అయ్యాను. ఆ రోజు నుంచి మలం డొనేట్ చేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. “రోగుల ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది” అని వివరించారు. అయితే, మలం దానం చేయడానికి చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నాడు. ఫస్ట్ స్ర్కీనింగ్, ఆ తర్వాత లైఫ్ స్టైల్, వైద్య పరీక్షలు, మెడికల్ చెకప్, మలం, మూత్రం, మల పరీక్ష నిర్వహించారు. అన్ని పరీక్షల తర్వాత మలం తీసుకోవడం ప్రారంభించారు” అని చెప్పుకొచ్చాడు.

మలంతో వ్యాపారం 

“నేను వారికి మలం అందించినందుకు ఫలితంగా డబ్బులు వస్తున్నాయి. గత ఏడాదిలో 149 మలం శాంపిల్స్ ఇచ్చాను.  ఒక్కొక్కరికి $25 (సుమారు రూ. 2,300) డబ్బులు వచ్చాయి. నా స్నేహితులు మలం అమ్మడాన్ని ఫన్నీగా భావిస్తారు. కానీ, సపోర్ట్ చేస్తారు. నా కుటుంబం కూడా మంచి సపోర్ట్ అందిస్తుంది. అయితే, డబ్బు కోసం కాకుండా సేవ చేస్తున్నాననే భావనతోనే ఈ పని చేస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. చాలా మంది నెటిజన్లు కూడా ఆయన చేసే పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఆయన మంచి పని చేస్తున్నారని అభినందిస్తున్నారు.

Read Also: రూ. 5 వేలతో ఉద్యోగం, ఇప్పుడు రూ. 3 కోట్ల ఇల్లు కొనేసింది.. హ్యాట్సాఫ్ హిమి!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×