E-Paper
Advertisement

Devkhel OTT Release date : హోలీ పండగ రోజు ఊర్లో ఒకరు బలి… గ్రామాన్ని వెంటానే భయంకరమైన శాపం… మతిపోగొట్టే మరాఠీ ఒరిజినల్ సిరీస్

Devkhel OTT Release date : హోలీ పండగ రోజు ఊర్లో ఒకరు బలి… గ్రామాన్ని వెంటానే భయంకరమైన శాపం… మతిపోగొట్టే మరాఠీ ఒరిజినల్ సిరీస్
Advertisement

Devkhel OTT Release date : ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దేవ్‌ఖేల్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొంకణ్ ప్రాంతంలోని జానపద సంప్రదాయాల నేపథ్యంలో ఈ సిరీస్ ఉంటుంది. హోలీ పండుగ సందర్భంగా శంకాసురుడి పురాణానికి సంబంధించిన హత్యలతో కథ మొదలవుతుంది. ఇన్‌స్పెక్టర్ విశ్వాస్ ఇన్వెస్టిగేషన్ తో స్టోరీ ఉత్కంఠంగా సాగనుంది. మరి దీని కథ ఏమిటి ?  ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? అనే వివరాలను తెలుసుకుందాం.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే 

ఈ సైకలాజికల్ మరాఠీ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘దేవ్‌ఖేల్’ (Devkhel). ఇది జనవరి 30న ZEE5లో అందుబాటులోకి వస్తుంది. చంద్రకాంత్ లతా గైక్వాడ్ రూపొందించిన ఈ సరీస్ లో అంకుష్ చౌదరి, ప్రజక్తా మాలి, యతిన్ కార్యేకర్, అరుణ్ నలవాడే, వీణా జమ్కర్, మంగేష్ దేశాయ్ వంటి నటులు నటించారు. ఈ సిరీస్‌లో మరాఠీ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన నటీనటులు అద్భుతమైన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ఇక ప్రధాన పాత్రలో అంకుష్ చౌదరి ఇన్‌స్పెక్టర్ విశ్వాస్ సరంజామే అనే పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్ర కథకి హైలెట్ గా ఉండనుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మహారాష్ట్రలోని దేవ్‌ఖేల్ అనే ఒక గ్రామంలో ఒక భయంకరమైన వింత సంఘటన దశాబ్దాలుగా జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి రాత్రి, గ్రామంలో ఎవరో ఒకరు మిస్టరీగా చనిపోతుంటారు. అయితే ఈ మరణాలను గ్రామస్థులు కేవలం హత్యలుగా చూడరు. పురాణాల్లోని ‘శంకాసురుడు’ అనే దైవం ఇచ్చే దైవిక శిక్షగా వాళ్ళు బలంగా నమ్ముతారు. న్యాయం జరగని చోట శంకాసురుడే స్వయంగా వచ్చి తీర్పునిస్తాడని అక్కడి వాళ్ళ నమ్మకం.

ఈ క్రమంలో ఇన్స్‌పెక్టర్ విశ్వాస్ సరంజామే (అంకుష్ చౌదరి) ఈ మిస్టీరియస్ మరణాల వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయడానికి గ్రామానికి వస్తాడు. అతను మూఢనమ్మకాలను నమ్మడు. కేవలం ఆధారాలను మాత్రమే నమ్ముతాడు. ఇక ఆ గ్రామంలోని మూఢనమ్మకాల మధ్య అతను విచారణను ఎలా కొనసాగించాడు ? అక్కడ జరుగుతున్న మరణాలకు కారణం ఎవరు ? నిజంగానే ఏదైనా అతీత శక్తి ఉందా ? అనే ఉత్కంఠతో ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సాగుతుంది.

Advertisement

Read Also : 2000 ఎత్తున్న టవర్ పై ఇద్దరే అమ్మాయిలు… ఒక్కో టర్న్ కి గుండె జారిపోద్ది… నెక్స్ట్ ఏం జరుగుతుందన్న టెన్షన్ కే పోతారు భయ్యా

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×