Kavya Kalyan Ram: కావ్య కళ్యాణ్ రామ్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం హీరోయిన్ గా మసూద, బలగం వంటి సినిమాలలో నటించి సూపర్ సక్సెస్ అందుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇదిలా ఉండగా కావ్య కళ్యాణ్ రామ్ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.
కావ్య ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి కుమారుడైన కాలభైరవ(Kalabhairava)తో ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వీరిద్దరి రిలేషన్ కి సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ ఇటీవల కాలభైరవ కావ్య ఇద్దరు తమ రిలేషన్ గురించి అధికారికంగా తెలియజేశారు. ఇకపోతే తాజాగా కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తుంటే ఈమె ఎంగేజ్మెంట్ పూర్తి అయిందని తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థంకి (Engagment)సంబంధించిన ఫోటోలను కావ్య ఎక్కడ షేర్ చేయకపోయినా పరోక్షంగా తన నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫోటోలను బయటపెట్టినట్టు తెలుస్తుంది.
ఇంస్టాగ్రామ్ వేదికగా కావ్య కళ్యాణ్ రామ్ కొన్ని ఫోటోలను షేర్ చేశారు ఇందులో భాగంగా ఈమె తన చేతులకు మెహంది పెట్టుకోవడం అలాగే చేతికి రింగ్ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో కావ్య కాలభైరవ నిశ్చితార్థం పూర్తి అయిందని ఈ విషయాన్ని కావ్య ఇలా పరోక్షంగా తెలియజేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె లైఫ్ ఈజ్ గుడ్ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు కూడా కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఎలాంటి హడావిడి లేకుండా కాలభైరవ కావ్య నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ లాగే జరిగిందని తెలుస్తోంది. అతి త్వరలోనే కావ్య కళ్యాణ్ పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించబోతున్నట్లు సమాచారం.
ఇక కాలభైరవ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన ఎం ఎం కీరవాణి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సింగర్ గాను అలాగే సంగీత దర్శకుడిగాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. గత కొద్ది రోజులుగా రిలేషన్ రూమర్లలో నిలిచిన ఈ జంట ఆ రూమర్లను నిజం చేస్తూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ముద్దు సీన్ ఉంటే అడల్ట్ సినిమా అవుతుందా? ట్రోలర్స్ కు నాగ వంశీ కౌంటర్!