E-Paper
Advertisement

S.S.Thaman:  ఎస్ ఎస్ తమన్ అసలు పేరేంటో తెలుసా..పేరు మార్పుకు కారణం అదేనా?

S.S.Thaman:  ఎస్ ఎస్ తమన్ అసలు పేరేంటో తెలుసా..పేరు మార్పుకు కారణం అదేనా?
Advertisement

S.S.Thaman: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం కోసం వారి పేర్లలో పెద్ద ఎత్తున మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఇలా పేర్లు మార్చుకున్న తర్వాత ఎంతోమందికి ఇండస్ట్రీలో కలిసి వచ్చి స్టార్స్ గా కొనసాగుతూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. న్యూమరాలజీ ప్రకారం ఇలా ఎంతోమంది వారి సొంత పేర్లతో కాకుండా కొత్త పేర్లతో ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ఈ కోవకు చెందిన వారే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్(S.S.Thaman). సంగీత దర్శకుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

తమన్ పేరు మార్పుకు ఇదే కారణమా?

తమన్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తన సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా తమన్ ఈ సందర్భంగా బయటపెట్టారు. ఎస్ ఎస్ తమన్ గా చలామణి అవుతున్న ఈయన అసలు పేరు ఇది కాదు అనే విషయాన్ని తెలియజేశారు. మరి తమన్ అసలు పేరు ఏంటి? పేరు మార్చుకోవడానికి గల కారణాలు ఏంటి? అనే విషయాన్న వస్తే…

ఘంటసాల శివకుమార్..

Advertisement

ఎస్ ఎస్ తమన్ చిన్నప్పటినుంచి సంగీతంపై ఎంతో ఆసక్తితో అటువైపుగా అడుగులు వేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా ఇండస్ట్రీలో తమన్ పేరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈయన అసలు పేరు ఘంటసాల శివకుమార్ (Ghantasala sivakumar) అని తెలిపారు. ఇక ఈయన తన పేరును మార్చుకోవడానికి గల కారణాలను తెలియజేశారు. తమన్ పెట్టుకున్న ఈ పేరు తన తండ్రి పేరు అని తెలుస్తోంది. ఈయన కూడా సంగీత విద్వాంసులు కావటం విశేషం. అయితే తన తండ్రి పేరుతో ఈయన కూడా సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీలో కొనసాగడం ఇష్టం లేకపోవడంతోనే తన పేరును మార్చుకున్నట్లు తెలిపారు. చిన్నతనంలోని తన తండ్రి చనిపోయారట తన తండ్రి పేరుతో ఈయన కూడా ఇండస్ట్రీలోకి వచ్చి ఏదైనా జరగరాని తప్పు, చేయరాని తప్పు చేస్తే నా పేరు పై పడే మచ్చ కారణంగా తన తండ్రి పేరుకు కూడా మచ్చ వస్తుందని భావించి పేరు మార్చుకున్నట్లు తెలిపారు. తన కారణంగా తన తండ్రి పేరు పై ఎలాంటి మచ్చ పడకూడదన్న ఉద్దేశంతోనే తమన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

తండ్రి పట్ల గౌరవంతోనే..

Advertisement

ఇలా పేరు మార్చుకోవాలనుకున్న ఈయన తనకు ఏ పేరు అయితే సెట్ అవుతుందని చాలా ఆలోచించారట. తనకు గూగుల్ అనే పేరు చాలా బాగా నచ్చిందని అయితే ఈ పేరుకు చాలా దగ్గరగా తమన్ అనే పేరు ఉండడంతో అదే పేరును పెట్టుకున్నానని ఈయన తెలియజేసారు. సాధారణంగా ఎవరైనా వారి తల్లిదండ్రులకు గుర్తుగా పేర్లను పెట్టుకుంటారు కానీ తమన్ మాత్రం తన వల్ల తన తండ్రి పేరుకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే తండ్రి పేరును కాస్త పక్కన పెట్టి తనకు నచ్చిన పేరును పెట్టుకుని చలామణి అవుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు తమ తండ్రి అంటే ఎంత గౌరవమో స్పష్టమవుతుందని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Divi Vadthya: పుష్ప 2 విషయంలో చెప్పిందొక్కటి.. చేసిందొక్కటి.. మొత్తం లేపేశారన్నదివి !

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×