E-Paper
Advertisement

Film industry: ఘోరం..రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యువ నటి మృతి!

Film industry: ఘోరం..రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యువ నటి మృతి!
Advertisement

Film industry: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల మరణాలు అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఒకవైపు వయసు రీత్యా సెలబ్రిటీలు తుదిశ్వాస విడిస్తే.. మరొకవైపు వృద్ధాప్య కారణాలవల్ల సెలబ్రిటీల కుటుంబ సభ్యులు మరణించడం అభిమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది . కొంతమంది ఆత్మహత్య చేసుకొని మరణిస్తుంటే.. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడుస్తున్నారు. ఇంకొంతమంది ఇలా రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువ నటి రోడ్డు ప్రమాదంలో 30 ఏళ్లకే తుది శ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆమె ఎవరు? ఈ రోడ్డు ప్రమాదం ఎప్పుడు? ఎక్కడ? ఎలా జరిగింది ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ నటిగా, మోడల్ గా మంచి పేరు దక్కించుకున్న హర్షిల్ కాలియా (Harshil Kalia).. సోమవారం రాత్రి (మార్చి 23) తన కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి బోల్తాపడడంతో హర్షిల్ కాలియా అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో కారు ఎడమవైపుకి బోల్తా కొట్టినట్లు కనిపించింది. దీంతో 30 ఏళ్ల ఆ నటి తలకు తీవ్ర గాయాలయ్యాయి.అది గమనించిన స్థానికులు ఆమెను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించగా.. గాయాలతో ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు.

తలకు బలంగా గాయాలవడం వల్లే..

Advertisement

హర్షిల్ కాలియా ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ అనే వెబ్ సిరీస్ లో, పలు రాజస్థానీ మ్యూజిక్ వీడియోలలో నటించింది. ఈమె రాత్రి ఆలస్యంగా పని ముగించుకొని తిరిగి వస్తుండగా ఆమె కారు అకస్మాత్తుగా అదుపు తప్పింది. ఆ తర్వాత అది డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టడంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక హాస్పిటల్ కి చేర్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆమె కారు సడన్గా అదుపు తప్పడానికి గల కారణం ఏమిటి? అనే విషయం మాత్రం తెలియరాలేదు. తలకు తీవ్రంగా గాయాలవడం వల్లే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఏది ఏమైనా బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువ నటి ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ALSO READ:Allu Sirish -Nayanika Reddy: మళ్లీ తలనొప్పి మొదలు.. ఈ కష్టం తప్పదా అంటూ అల్లు శిరీష్ స్పెషల్ పోస్ట్!

హర్షిల్ కాలియా కెరియర్..

Advertisement

హర్షిల్ కాలియా కెరియర్ విషయానికొస్తే.. వెబ్ సిరీస్ లు, రాజస్థానీ మ్యూజిక్ వీడియోలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. అటు మోడలింగ్ లో కూడా తన కెరీర్ను ప్రారంభించింది. ఇక ఇంస్టాగ్రామ్ లో గణనీయమైన ఫాలోవర్స్ ను సంపాదించుకొని పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక అలాంటి ఈమె ఆకస్మిక మరణం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణను వేగవంతం చేశారు

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×