E-Paper
Advertisement

Allu Sirish -Nayanika Reddy: మళ్లీ తలనొప్పి మొదలు.. ఈ కష్టం తప్పదా అంటూ అల్లు శిరీష్ స్పెషల్ పోస్ట్!

Allu Sirish -Nayanika Reddy: మళ్లీ తలనొప్పి మొదలు.. ఈ కష్టం తప్పదా అంటూ అల్లు శిరీష్ స్పెషల్ పోస్ట్!
Advertisement

Allu Sirish -Nayanika Reddy:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ (Allu Sirish) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి రాకముందే ప్రొడ్యూసర్ గా , అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ను హిందీలో మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీకి ‘గౌరవం’ అనే సినిమాతో పరిచయమయ్యారు. 2013లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్కక్షణం, ఊర్వసివో రాక్షశివో వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇకపోతే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈయన.. మరొకవైపు తన అన్నయ్య అల్లు అర్జున్ రేంజ్ లో సక్సెస్ అయితే అందుకోలేదనే చెప్పాలి. కానీ తనవంతు ప్రయత్నంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

పెళ్లయిన కొన్ని రోజులకే ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ..

ఇకపోతే సినిమాలలో నటిస్తున్నప్పుడే ప్రముఖ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపించాయి. అప్పట్లో ఈ విషయంపై అల్లు అరవింద్ కూడా స్పందించారు. కానీ ఆ వార్తలన్నీ కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. కానీ మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ , హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి కుదిరిన సందర్భంగా ప్రముఖ హీరో నితిన్, ఆయన భార్య షాలిని కలిసి ఒక పార్టీ ఇచ్చారు. సన్నిహితుల కోసం ఇచ్చిన ఈ పార్టీలో షాలిని స్నేహితురాలు నయనికా రెడ్డి కూడా హాజరయ్యింది . అక్కడే అల్లు శిరీష్ ఆమెను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయారు.

Advertisement

ఇక దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరు ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి ఈ ఏడాది మార్చి 6వ తేదీన హైదరాబాద్లో కుటుంబ సభ్యులు ,రాజకీయ ప్రముఖులు , సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక వివాహం అనంతరం ఈ జంటను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కలిసి ఆశీర్వదించిన విషయం తెలిసిందే.

ALSO READ:Virosh couple: హనీమూన్ కి వెళ్ళిన విరోష్ జంట.. స్పెషల్ వీడియో పంచుకున్న రష్మిక!

స్పెషల్ పోస్ట్ పంచుకున్న అల్లు శిరీష్..

Advertisement

ఇకపోతే వివాహమనంతరం హనీమూన్ కి వెళ్ళకుండా తాజాగా అల్లు శిరీష్ పంచుకున్న పోస్ట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే వీరితో పాటు వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ప్రస్తుతం హనీమూన్ కి వెళ్లి వెకేషన్ మోడ్ లో తెగ ఎంజాయ్ చేస్తుంటే.. అల్లు శిరీష్ భార్య నయానికా రెడ్డి మాత్రం ప్రొఫెషనల్ లైఫ్ లోకి బ్యాక్ అవడంతో అల్లు శిరీష్ అభిమానులు కాస్త ఫీలవుతున్నారు. హనీమూన్ కి వెళ్ళకుండా మళ్ళీ ప్రొఫెషనల్ లైఫ్ అనడం ఏంటి? దానికి కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే .. తాజాగా నయనికా రెడ్డి వివాహం అనంతరం తన ప్రొఫెషనల్ వర్క్ లో బిజీ అయిపోయింది. ఇక ఆమె తల పట్టుకొని కూర్చున్న ఫోటోని అల్లు శిరీష్ షేర్ చేస్తూ.. బ్యాక్ టు ఎక్సెల్ షీట్స్, జూమ్ మీటింగ్స్ అండ్ రియల్ ఎస్టేట్” అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా పోస్ట్ పెట్టారు . ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కాస్త ప్రొఫెషనల్ లైఫ్ కి బ్రేక్ ఇచ్చి వ్యక్తిగతంగా సంతోషకరమైన జీవితాన్ని గడపండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లయిన వెంటనే ఇలా తమ పనిలో బిజీ అవడం చూసి.. పని పట్ల వీరికున్న నిబద్ధత అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×