E-Paper
Advertisement

జోయా అఖ్తర్ ఆఫీస్‌లో భారీ చోరీ.. ఏకంగా 66 హార్డ్ డిస్క్‌లు మాయం, కోట్లలో నష్టం!

జోయా అఖ్తర్ ఆఫీస్‌లో భారీ చోరీ.. ఏకంగా 66 హార్డ్ డిస్క్‌లు మాయం, కోట్లలో నష్టం!
Advertisement

Zoya Akhtar: ఒకటి కాదు రెండు కాదు..నా ఆఫీస్ లో ఏకంగా 66 హార్డ్ డిస్క్‌లు చోరీకి గురయ్యాయని తెగ బాధపడిపోతుంది బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ జోయా అఖ్తర్‌..పై పెచ్చు డబ్బు కోసం మనుషులు ఎంతటి నీచానికైనా ఒడిగడతారని, తాము ప్రాణప్రదంగా నమ్మిన వారే ఇలాంటి ద్రోహానికి పాల్పడటం తీవ్రంగా కలిచివేస్తోందంటూ ఆమె వ్యక్తం చేసిన విచారం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

సినిమాల భవిష్యత్తు అంధకారం

Advertisement

సాధారణంగా ఇండస్ట్రీలో హార్డ్ డిస్క్ అనేదే అన్నింటికి మూలం. అలాంటి హార్డ్ డిస్క్ కోల్పోవడం అంటే కొన్ని కోట్ల రూపాయలని పోగొట్టుకున్నట్టే.ఇక మాయమైన ఆ 66 హార్డ్ డిస్క్‌లలో కూడా షూటింగ్ పూర్తి చేసుకున్న ముడి ఫుటేజ్, ఎడిటింగ్ వర్క్, హై-ఎండ్ గ్రాఫిక్స్ డేటాతో పాటు రాబోయే భారీ ప్రాజెక్టులకు సంబంధించిన స్క్రిప్ట్‌లు, కాన్ఫిడెన్షియల్ కాంట్రాక్ట్ వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనుకోకుండా ఇలా హార్డ్ డిస్క్ లు పోవడంతో ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన, జరుగుతున్న, జరగబోయే ప్రాజెక్టుల పనులు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ ఈ డేటా గనుక లీక్ అయితే ఆ సినిమాల భవిష్యత్తు అంధకారంలో పడటం పక్కా.

హార్డ్ డిస్క్ లు మాయం జోయాకి పెద్ద షాక్

Advertisement

జోయా అఖ్తర్ విషయానికి వస్తే తన టైగర్ బేబీ ఫిల్మ్స్ పై గతంలో ‘జిందగీ నా మిలేగి దొబారా’, ‘గల్లీ బాయ్’, ‘ది ఆర్చీస్’ వంటి క్రేజీ మూవీస్ తో పాటు సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’ను ప్రేక్షకులకు అందించింది. ప్రస్తుతం ఆమె సంస్థ పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టింది కూడా.ఇలాంటి సమయంలో ఇలా హార్డ్ డిస్క్ లు మాయం అవడం జోయాకి పెద్ద షాక్ నే ఇచ్చింది.

also read :మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఫిక్స్?ఎంపీ సీటు ఖాయమైనట్లేనా?

ఏది ఏమైనా ఈ చోరీ అనేది బాలీవుడ్‌లోని ప్రొడక్షన్ హౌస్ లలో ఉండే సెక్యురిటీ లోపాలను, మేనేజ్‌మెంట్ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. నమ్మకమే పెట్టుబడిగా, ఒకరి పట్ల ఒకరికి నమ్మకంతో నడిచే సినీ రంగంలో సొంత వాళ్ళే ఇలాంటి అక్రమాలకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడితే కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించే చిత్రాల నిర్మాతలు కోలుకోలేని దెబ్బతింటారన్నది కాదనలేని సత్యం.

ఈ చోరీతోనైనా సినిమా ఇండస్ట్రీలు అలర్ట్ అవుతాయా?

ఇక ఈ చోరీ ఇన్సిడెంట్ పై ఇప్పటికే ముంబై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు అక్కడ పనిచేసే ప్రస్తుత ఉద్యోగులను, ఇటీవలి కాలంలో ఉద్యోగాలు వదిలి వెళ్లిన పాత సిబ్బందిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలుస్తుంది.

also read :రామ్-అనిల్ రావిపూడి కాంబో.. క్రేజీ ప్రాజెక్టా? లేక డిజాస్టర్ ఫార్ములానా?

అయితే లోపల ఉన్న వ్యక్తుల సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున, భారీ బరువుండే 66 హార్డ్ డిస్క్‌లను కార్యాలయం నుండి బయటకు తరలించడం అసాధ్యం. కాబట్టి త్వరలోనే ఈ నేరానికి పాల్పడిన అసలు సూత్రధారులు, పాత్రధారులు దొరుకుతారని చిత్ర యూనిట్ గట్టి ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి ఈ చోరీతోనైనా సినిమా ఇండస్ట్రీలు అలర్ట్ అయి తమ కష్టాన్ని, కోట్ల రూపాయలని దొంగల పాలు కాకుండా కాపాడుకుంటాయో లేదో చూడాలి !

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×