E-Paper
Advertisement

కదిలే ఏసీ vs ఎయిర్ కూలర్.. సామాన్యులకు ఏది బెస్ట్.. సూటిగా సుత్తిలేకుండా!

కదిలే ఏసీ vs ఎయిర్ కూలర్.. సామాన్యులకు ఏది బెస్ట్.. సూటిగా సుత్తిలేకుండా!
Advertisement

Portable AC vs Desert Cooler: తెలుగు రాష్ట్రాల్లో ఎండ బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు అవుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఏసీ లేదా కూలర్ ఉంటే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే గోడకు రంధ్రాలు చేయడం ఇష్టం లేని వారి దృష్టి పోర్టబుల్ ఏసీ, డెజర్ట్ ఎయిర్ కూలర్ పై పడుతోంది. కానీ రెండింట్లో ఏది బెస్ట్ అన్న విషయంలో వారిలో కన్ఫూజన్ ఉంటోంది. ఈ నేపథ్యంలో ధర, కరెంట్ బిల్లు ఆదా, కూలింగ్ సామర్థ్యం వంటి ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ రెండిటిలో ఏది బెటరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కూలింగ్ ఎలా ఇస్తాయంటే?

సాధారణ విండో లేదా స్ప్లిట్ ఏసీల లాగే పోర్టబుల్ ఏసీ కూడా కంప్రెషర్, రిఫ్రిజెరెంట్ గ్యాస్ సహాయంతో పనిచేస్తాయి. ఇవి గదిలోని వేడిని, తేమను (Humidity) లాగేసి చల్లటి గాలిని అందిస్తాయి. వేడి గాలిని బయటకు పంపేందుకు ఒక పైపును ఈ పోర్టబుల్ ఏసీలకు తగిలిస్తారు. మరోవైపు డెజర్ట్ కూలర్ అనేది పూర్తిగా ‘భాష్పీభవనం’ ప్రక్రియపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది బయటి వేడి గాలిని లోపలికి లాగి నీటితో తడిసిన హనీకోంబ్ లేదా గడ్డి ప్యాడ్‌ల ద్వారా చల్లబరిచి గదిలోకి పంపుతుంది. అయితే చల్లదనం విషయంలో పోర్టబుల్ ఏసీలు స్పష్టమైన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది.

ధరల పరంగా చూస్తే..

Advertisement

ధరల విషయంలో డెజర్ట్ కూలర్లదే పైచేయి అని చెప్పవచ్చు. ఇవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎయిర్ కూలర్ల ధర మార్కెట్లో రూ.6,000 నుండి రూ.18,000 వరకు ఉంటుంది. అదే పోర్టబుల్ ఏసీ అయితే రూ. 25,000 నుండి రూ.50,000 వరకు పలుకుతోంది.

విద్యుత్ ఆదా

విద్యుత్ ఆదా పరంగా చూస్తే డెజర్ట్ కూలర్లు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తాయి. ఇవి కేవలం ఒక ఫ్యాన్, చిన్న వాటర్ పంప్‌తో నడుస్తాయి కాబట్టి 150 నుండి 300 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వాడుకుంటాయి. రోజుకు 8 గంటలు వాడినా నెలకు రూ.300 నుండి రూ.500 లోపే బిల్లు వస్తుంది. అదే పోర్టబుల్ ఏసీ అయితే ఇందులో కంప్రెషర్ ఉండటం వల్ల 900 నుండి 1,800 వాట్ల విద్యుత్ అవసరమవుతుంది. దీనివల్ల నెలకు సుమారు రూ.2,000 నుండి రూ.3,500 వరకు అదనంగా కరెంట్ బిల్లు వచ్చే అవకాశం ఉంది.

క్లైమెట్ పరంగా..

Advertisement

ఏసీ లేదా కూలర్ ను ఎంచుకునేటప్పుడు మీ ప్రాంత వాతావరణాన్ని సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. డెజర్ట్ కూలర్ అయితే ఇది కేవలం పొడి వాతావరణం (Dry Heat) ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే (తీర ప్రాంతాలు) ఇది గదిని ఉక్కపోతగా మార్చేస్తుంది తప్ప చల్లదనాన్ని ఇవ్వదు. అదే పోర్టబుల్ ఏసీ.. ఎలాంటి వాతావరణంలోనైనా అద్భుతంగా పనిచేస్తుంది. తీరప్రాంతాల్లోనైనా గదిలోని తేమను పూర్తిగా నియంత్రించి సూపర్ కూలింగ్ ఇస్తుంది.

రోజూవారీ వాడకం..

డెజర్ట్ కూలర్లలో రోజూ లేదా రోజు మార్చి రోజు నీళ్లు తప్పకుండా పోయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారానికి ఒకసారి ట్యాంక్ సైతం క్లీన్ చేయాలి. లేదంటే దుర్వాసన వస్తుంది. అదే పోర్టబుల్ ఏసీ అయితే నీళ్లు పోసే అవసరం ఉండదు. కేవలం ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అయితే రిపేర్లు, సర్వీసింగ్ ఛార్జీల పరంగా మాత్రం కూలర్ కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. పోర్టబుల్ ఏసీ అయితే మెకానిక్ ఛార్జీలు కాస్త పెద్ద మెుత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Also Read: గాంధీ భవన్‌లో ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ హజ్రీ మధ్య ఘర్షణ.. ఆపై నేతల రియాక్షన్ ఇదే

ఫైనల్గా ఏది బెస్ట్ అంటే?

పొడి వాతావరణంలో ఉంటూ.. తక్కువ కరెంటు బిల్లు రావాలని కోరుకుంటే కూలర్లు బెస్ట్ ఆప్షన్ నిలుస్తాయి. పైగా తక్కువ బడ్జెట్ లోనే కూలర్ లభిస్తుండటం ఆర్థికంగా కలిసిరానుంది. అలాకాకుండా కూలింగ్ కు ప్రాధాన్యత ఇస్తూ.. అన్ని వర్షాకాలంలోనూ సమర్థవంతంగా వర్క్ చేయాలని భావిస్తే.. పోర్టబుల్ ఏసీలు తీసుకోవచ్చు. కాబట్టి మీ అభిరుచి, అవసరానికి తగ్గట్లు ఉన్న దానిని మీరే ఎంచుకోండి.

Also Read: విమాన ప్రయాణికులకు షాక్.. జూన్ 1 నుంచి భారీగా తగ్గనున్న.. Air India, Indigo సర్వీసులు!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×