Rukmini Vasanth:సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్ రుక్మిణి వసంత్.. ఇప్పుడు తన చీరకట్టుతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.ముఖ్యంగా మైసూరు దసరా వేడుకల సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోలని చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
రుక్మిణి వసంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మైసూరు దసరా వేడుకలకు సంబంధించిన ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ ఏడాది దసరా తన మనసుకు ఎంతో దగ్గరగా నిలిచిపోయిందని అందులో చెప్పుకొచ్చింది.సాధారణంగా మైసూరు దసరా అంటేనే ఘనమైన వేడుకలు, సంప్రదాయాలు, రాజసం గుర్తుకొస్తాయన్న సంగతి తెల్సిందే .అలాంటి పండుగను ఈసారి మరింత ఆనందంగా జరుపుకున్నానని రుక్మిణి తన పోస్టులో చెప్పుకొచ్చింది. తనపై ఎంతో ప్రేమ చూపించిన మైసూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేసింది ఈ కన్నడ కస్తూరి.
ఈ సందర్భంగా రుక్మిణి ధరించిన చీర స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయింది.నీలిరంగు మైసూర్ సిల్క్ చీరకు బంగారు రంగు అంచులు, అందమైన సంప్రదాయ డిజైన్లు ప్రత్యేకమైన లుక్‌ను తీసుకొచ్చాయనడం లో సందేహం లేదు . దీనికి మ్యాచింగ్‌గా గోల్డెన్ బ్లౌజ్ ధరించి, మెడలో గోల్డెన్ జ్యూవెలరీ, చెవులకు జుంకాలతో సింపుల్ మేకప్‌తో,క్లాసీగా కనిపించి అభిమానులని మెస్మరైజ్ చేసింది. ట్రెండీగానే కాకుండా ట్రెడిషనల్ గా కూడా ఎంత స్టైలిష్‌గా కనిపించవచ్చో ఈ ఫొటోలతో మరోసారి ప్రూవ్ చేసింది ఈ ముద్దుగుమ్మ .
ఇక రుక్మిణి వసంత్ విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీ నుండి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.ముఖ్యంగా రిషబ్ శెట్టి నటించిన సప్త సాగరదాచే ఎల్లో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఆమె నటన, ఎమోషన్స్ ప్రేక్షకులని కట్టిపడేశాయి.
అలాగే కన్నడలో వచ్చిన బఘీర వంటి చిత్రాలతోనూ అలరించిన ఈ భామ తాజాగా టాక్సిక్ సినిమాతో మెప్పించింది .ఇక యంగ్ టైగర్ తారక్ ,నెల్సన్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమాలోనూ ఈ బ్యూటీ నే హీరోయిన్ అన్న సంగతి చెప్పక్కర్లేదు.
ఇక సెలెబ్రిటీల విషయానికి వస్తే సోషల్ మీడియాలో వీరి లుక్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో. చెప్పక్కర్లేదు. పండుగలు, పెళ్లిళ్లు, స్పెషల్ ఈవెంట్స్ సందర్బంగా హీరోయిన్లు ధరించే చీరలు, ఆభరణాలు, హెయిర్‌స్టైల్స్‌ను ఫాన్స్ క్యూరియస్ గా వాచ్ చేస్తుంటారు కూడా.ఈ క్రమంలోనే రుక్మిణి వసంత్ మైసూర్ దసరా లుక్ కూడా ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది.
మొత్తానికి, సినిమాలతోనే కాకుండా తన సంప్రదాయ ఫ్యాషన్‌తోనూ రుక్మిణి వసంత్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.