E-Paper
Advertisement

రాజంపేటలో విచిత్ర దొంగతనం.. గాలిలో తేలుతూ వచ్చి రూ. 35 వేలు దోచేసిన లూటీ మాస్టర్!

రాజంపేటలో విచిత్ర దొంగతనం.. గాలిలో తేలుతూ వచ్చి రూ. 35 వేలు దోచేసిన లూటీ మాస్టర్!
Advertisement

Rajampet Theft: ఈ సీన్ చూసి.. పాపం ఎవరో వ్యక్తి ఉరికి వేలాడుతున్నాడని అనుకుంటున్నారా? కానేకాదు. వాడు ఉరి వేసుకోవడం లేదు. షాపులో ఉన్న సరుకును ఊడ్చేయడానికి వచ్చాడు. కడప జిల్లా.. రాజంపేట.. మెయిన్ రోడ్.. HDFC బ్యాంక్‌కి సరిగ్గా ఎదురుగా ఓ కూల్ డ్రింక్స్ షాపు. బ్యాంకు ఎదురుగానే ఉందని ఆ దొంగకి డబ్బు వాసన బాగా తగిలినట్టుంది. ఈ గ్రేట్ లూటీ మాస్టర్ డోర్‌ దగ్గరికి వెళ్లి టైమ్ వేస్ట్ చేయలేదు.. డైరెక్ట్‌గా పైకప్పు రేకులు ఊడదీసి.. లోపలికి గాలిలో తేలుతూ స్టూల్‌పై ధభీమని దూకేశాడు. సినిమాల్లో హీరో ఎంట్రీ కూడా ఇంత స్టైలిష్‌గా ఉండదేమో!

ఆహా.. వాడి బుర్ర బంగారమే..

Advertisement

ఎక్కడ సీసీ కెమెరాకు దొరికిపోతానని భయపడి.. వెంటనే తన షర్ట్‌ను మొహానికి మాస్క్‌లా కవర్ చేశాడు. ఆహా.. వాడి బుర్ర బంగారమే.. అచ్చం హాలీవుడ్ విలన్‌లా కౌంటర్ దగ్గరకు వెళ్లి అటు ఇటు చూశాడు. ఎటు చూసినా.. చాక్లెట్, బిస్కెట్ డబ్బాలే కనిపించాయి. వాటిని ఫస్ట్ టచ్ చేయకుండా కౌంటర్ ఓపెన్ చేశాడు. అందులో ఏమీ లేదు. మరో కౌంటర్ తెరిచాడు.. వాడికి జాక్‌పాట్ తగిలింది. 35 వేల రూపాయల కట్ట కనిపించింది. ఇక ఆ వెధవ ఆగుతాడా.. క్యాష్‌తీసి జేబులో పెట్టేసుకున్నాడు. ఇటు సిగరెట్లు, చాక్లెట్ బాక్సులను కూడా బ్యాగ్‌లో కుక్కేసి మాయమయ్యాడు.

పోలీసుల దర్యాప్తు..

Advertisement

ఇదే షాపులో గతంలో కూడా ఓసారి ఇలాగే చోరీ జరిగిందట. దీంతో ఆ షాప్ ఓనర్ లబోదిబోమంటున్నాడు. చేసిన కష్టమంతా దొంగల పాలవుతుందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాజంపేట పోలీసులు సీన్లోకి ఎంటరయ్యారు. ఆ లఫూట్ గాడిని పట్టేయడానికి వేట మొదలుపెట్టారు. అసలు షర్ట్ మాస్క్ వెనక ఉన్న ఆ ముఖం ఎవరిది? పాత చోరీల వెనక కూడా వీడి ముఖం ఉందా? అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Also Read: రిటైర్డ్ ఆర్మీ దంపతులకు షాక్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.61.85 లక్షలు స్వాహా!

Tags

Related News

నెల్లూరులో కూటమికి షాక్.. జనసేన ఏంటో చూపిస్తాం అంటున్న శివశంకర్!

కిచెన్‌లోని ఈ వస్తువులతో జాగ్రత్త.. మీ ఆరోగ్య సమస్యలకు ఇవే కారణం కావొచ్చు

Karthika Deepam 2 Serial Today Episode October 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని గురించిన నిజం జ్యోత్స్న సూరజ్ కు చెప్తుందా..?            

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

Big Stories

Advertisement
×