E-Paper
Advertisement

IIT Bombay Campus Placements : ఐఐటీ బాంబేలో విద్యార్థులకు జాక్‌పాట్! 85 మందికి రూ. కోటికి పైగా ప్యాకేజీ!

IIT Bombay Campus Placements : ఐఐటీ బాంబేలో విద్యార్థులకు జాక్‌పాట్! 85 మందికి రూ. కోటికి పైగా ప్యాకేజీ!
Advertisement

IIT Bombay Campus Placements : దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, బాంబే విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాక్‌పాట్ కొట్టారు. దాదాపు 85 మంది విద్యార్థులు రూ. కోటికి పైగా ప్యాకేజీలతో ఉద్యోగాలు సంపాదించారు. 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఫేజ్-1 నియామకాలలో భాగంగా విద్యార్థులు ఈ ప్యాకేజీలను అందుకున్నారు.

ఫేజ్-1 నియామకాలలో దాదాపు 388 కంపెనీలు నియామక ప్రక్రియలో పాల్గొన్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి మొత్తం 1340 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 1188 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, గూగుల్‌, టాటా గ్రూప్, ఎయిర్ బస్ వంటి సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. కొన్ని కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహించాయి.

Advertisement

ఇక ఉద్యోగాలు పొందిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందినవారున్నారు. ఆ తర్వాత ఐటీ, ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌, డేటా సైన్స్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్ వంటి విభాగానికి చెందిన విద్యార్థులున్నారు. విదేశాల్లో పనిచేసేందుకు 63 మంది ఎంపికయ్యారు. ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులకు రూ.21.88 లక్షలు సగటు ప్యాకేజీని అందుకున్నారు. ఇక రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రూ.36.94 లక్షలు, ఐటీ విద్యార్థులు రూ.26.335 లక్షలు, ఫైనాన్స్‌, బ్యాంకింగ్, ఫిన్‌టెక్ విద్యార్థులు రూ.32.38 లక్షలు, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ విద్యార్థులు రూ.18.68 లక్షలు సగటు ప్యాకేజీతో ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు సాధించారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×