E-Paper
Advertisement

కేవలం ఆరంభం.. ఇంకా ఉందంటూ.. అభిజీత్ దీప్కే వీడియో మెసేజ్

కేవలం ఆరంభం.. ఇంకా ఉందంటూ.. అభిజీత్ దీప్కే వీడియో మెసేజ్
Advertisement

Abhijit Dipke: కాక్రోచ్ జనతాపార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే ఉద్యమం ఇంకా ముగియలేదా? ఆయన జర్నీ ఇంకా కొనసాగుతోందా? రానున్న రోజుల్లో కేంద్రప్రభుత్వంపై మరిన్ని ఉద్యమాలు ఉంటాయా? అందుకు అభిజీత్ విడుదల చేసిన వీడియో ఉదాహరణ. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోపై దేశంలో ఎలాంటి చర్చ జరుగుతోంది?

అభిజీత్ దీప్కే వీడియో మెసేజ్- దాదాపు పుష్కర కాలం తర్వాత మోదీ సర్కార్ ఉలిక్కిపడింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి కేంద్రం దిగిరావాల్సి వచ్చింది. ఇక్కడితో గేమ్ ముగియలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఓ వీడియో రిలీజ్ చేశాడు  అభిజీత్ దీప్కే. దాదాపు వారం రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని అందులో ప్రస్తావించాడు.

Advertisement

అభిజీత్ నెక్ట్స్ టార్గెట్ ఏ శాఖ-రేపు ఏం చేయాలి.. సాయంత్రానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఎలాంటి భయం లేదని మనసులోని మాట బయటపెట్టాడు. దాదాపు 37 రోజుల సాగిన పోరాటం అత్యంత కఠినంగా గడిచిందని గుర్తు చేసుకున్నాడు. మంత్రి రాజీనామాతో ముగియలేదన్నాడు. తమ పార్టీ ప్రయాణం ఇక్కడితో ఆగదని, కేవలం ఆరంభం మాత్రమేనన్నాడు.

ఇప్పుడు ఆరంభం.. సుధీర్ఘ ప్రయాణం- కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని చెప్పకనే చెప్పాడు. తమ నిరసనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమైనా మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. జ్వరం కారణంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పలేకపోయినందుకు క్షమాపణలు కోరాడు. ఈ దేశం కోసం మీరు చేసిన పోరాటాన్ని ఎప్పటికీ అభినందిస్తానని మద్దతు దారులను ఉద్దేశించి తెలిపాడు.

Advertisement

అడిగిన ప్రశ్నలు- చేసిన విమర్శల వల్ల మంచి ఫలితాలు సాధించామని అభిప్రాయపడ్డాడు. దీంతో అభిజీత్ నెక్ట్స్ టార్గెట్ ఏ శాఖ అంటూ అప్పుడే పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఏటా లక్షలాది మంది విద్యార్థులు పట్టా పుచ్చుకుని రోడ్లపైకి వస్తున్నారు. ఉద్యోగాలు దొరక్క యువత నిరుద్యోగులుగా మారిపోయారు.

ALSO READ: షాకింగ్ ఘటన.. బ్యాంక్ మేనేజర్‌ని కొట్టిన మాజీ సీఎం మనవరాలు, వీడియో వైరల్

దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలపై అభిజీత్ ఫోకస్ చేసినట్టు చెబుతున్నారు. అక్కడ ఉద్యమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.  ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ పార్టీ అడుగులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందట కేంద్రప్రభుత్వం.  మిగతా రాష్ట్రాల్లో సీజేపీ ఇదే పంధాను అనుసరిస్తే ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

 

 

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×