E-Paper
Advertisement

షాకింగ్ ఘటన.. బ్యాంక్ మేనేజర్‌ని కొట్టిన మాజీ సీఎం మనవరాలు, వీడియో వైరల్

షాకింగ్ ఘటన.. బ్యాంక్ మేనేజర్‌ని కొట్టిన మాజీ సీఎం మనవరాలు, వీడియో వైరల్
Advertisement

Chennai: సమయం, సందర్భం ఏంటన్నది కాసేపు పక్కనపెడితే.. బ్యాంక్ మేనేజర్ చెంప ఛెళ్లు మనిపించింది దివంగత మాజీ సీఎం కరుణానిధి మనవరాలు. కేవలం లిఫ్ట్ పని చేయకపోవడంపై జరిగిన మాటల యుద్ధంలో ఆవేశంతో కుర్చీ నుంచి పైకి లేచి మేనేజర్‌ని కొట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

చెన్నైలో షాకింగ్ ఘటన- ఆరు రోజుల కిందట అనగా జులై 20న చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఎస్‌బీఐ ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌ ఉంది. పని నిమిత్తం దివంగత మాజీ సీఎం కరుణానిధి మనవరాలు కాయల్విళి ఆ బ్యాంకుకు వెళ్లారు. అయితే బ్యాంకు భవనంలోని లిఫ్ట్ సరిగా పని చేయలేదు. దీనిపై కాయల్విళి.. ఆ బ్రాంచ్ మేనేజర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ భవనం కాయల్విళికి చెందినదిగా చెబుతున్నారు.

Advertisement

బ్యాంక్ మేనేజర్‌ని మాజీ సీఎం మనవరాలు- ఇరువురు మధ్య మాటా మాటా పెరగడంతో మేనేజర్ హావభావాలను హేళన చేస్తూ అనుకరించారు ఆమె. ఆ తర్వాత మేనేజర్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా కుర్చీ నుంచి లేచి మేనేజర్ చెంప ఛెళ్లుమణిపించారు. ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ మరో వ్యక్తి ఉన్నారు. సదరు మహిళను ఆపేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఆయన కూడా బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు బ్యాంకు‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

కేసు నమోదు, పోలీసుల విచారణ- ఈ ఘటనపై ఎస్‌బీఐ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు విచారణ నేపథ్యంలో శనివారం బ్యాంకుకు వచ్చి సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజ్ పరిశీలించారు. దీంతో ఆ ఘటన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మేనేజర్‌పై దాడి చేసి, బెదిరించిన ఆరోపణలపై కాయల్విళిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అన్నట్లు అసలు విషయానికి వద్దాం. కాయల్విళి ఎవరోకాదు.. తమిళనాడు దివంగత మాజీ సీఎం కరుణానిధి మనవరాలు, మాజీ కేంద్ర మంత్రి అళగిరి కూతురు.

Advertisement

ALSO READ: ఢిల్లీ కేంద్రంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రేసులో కీలక నేత!

 

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×