E-Paper
Advertisement

Ajit Pawar Aircraft: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి, ఆ విమానం గురించి మరికొన్ని వివరాలు

Ajit Pawar Aircraft: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి,  ఆ విమానం గురించి మరికొన్ని వివరాలు
Advertisement

Ajit Pawar Aircraft: మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతి వద్ద జరిగిన ఘటనలో ఆయనతోపాటు ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆయన ప్రయాణిస్తున్న విమానంపై అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ విమాన సంస్థ ఎవరిది? ఎలాంటి సమస్య తలెత్తింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

Advertisement

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీకి చెందినది. VSR సంస్థకు చెందిన లియర్‌జెట్ 45 విమానం. బాంబార్డియర్ లియర్‌జెట్ 45 బిజినెస్ జెట్. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పైలట్ నియంత్రణ కోల్పోయాడని తెలుస్తోంది. VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వహించబడుతోంది.

VT-SSKగా నమోదు చేయబడింది ఈ విమానం. బాంబార్డియర్ లియర్‌జెట్ 45 అనేది కార్పొరేట్, వీఐపీ ప్రయాణాలకు ఉపయోగించే ట్విన్-ఇంజన్ లైట్ బిజినెస్ జెట్. చిన్న చిన్న విమానాశ్రయాల కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రమాదానికి గురైన విమానం దేశంలో అతిపెద్ద నాన్-షెడ్యూల్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లలో ఒకటి.

Advertisement

VSR సంస్థకు చెందిన విమానం లియర్‌జెట్ 45 గురించి

VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని లియర్‌జెట్ 45 ఒకటి. అధిక పని తీరు గలది. సూపర్-లైట్ బిజినెస్ జెట్, దాని వేగం, ఇంధన సామర్థ్యం, ఎత్తైన ప్రాంతాల్లో తిరిగే సామర్థ్యం దాని సొంతం.  ఈ విమానం 47 అడుగుల విస్తీర్ణం, 9,752 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఈ కంపెనీని వికె సింగ్ అనే వ్యక్తి స్థాపించారు. ఆ తర్వాత ఆయన నాయకత్వంలో విఎస్ఆర్ వెంచర్స్ ఈ విమానాలను నిర్వహించింది.

ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రైవేట్ జెట్ చార్టర్లు, అద్దెకు హెలికాప్టర్లు, ఎయిర్ అంబులెన్స్‌లో ప్రత్యేకత కలిగి ఉంది. ఆ సంస్థ సముదాయంలో లియర్‌ జెట్ 45XR, బీచ్ ‌క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ B200, అగస్టా 109 హెలికాప్టర్లు వంటి విమానాలు ఉన్నాయి. ఈ విమానం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

ALSO READ:  విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి.. పలువురు నేతల సంతాపం

ఈ కంపెనీ ఎండ్-టు-ఎండ్ ఏవియేషన్ కన్సల్టెన్సీ,ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ సేవలను అందిస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. జెట్ ల్యాండింగ్ దశలో ఇబ్బంది ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి దారితీసిన ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఘటన ప్రాంతం నుంచి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు దారితీసిన వాటిపై పరిశీలన మొదలుపెట్టారు.

 

 

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×