E-Paper
Advertisement

Amazfit Active Max: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 రోజులు వాడొచ్చు.. అమాజ్‌ఫిట్ యాక్టివ్ మాక్స్ స్మార్ట్‌వాచ్ భారత్‌లో లాంచ్!

Amazfit Active Max: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 రోజులు వాడొచ్చు.. అమాజ్‌ఫిట్ యాక్టివ్ మాక్స్ స్మార్ట్‌వాచ్ భారత్‌లో లాంచ్!
Advertisement

Amazfit Active Max: ప్రముఖ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ అమాజ్‌ఫిట్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ Amazfit Active Maxను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. స్టైలిష్ లుక్, అదిరిపోయే డిస్‌ప్లే, కళ్ చెదిరే బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ వాచ్ టెక్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ వాచ్ ధర, ఫీచర్లు, కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మెరుగైన పనితీరు:

అమాజ్‌ఫిట్ యాక్టివ్ మాక్స్ ప్రీమియం అల్యూమినియం ఫ్రేమ్, రౌండ్ డయల్‌తో క్లాసిక్ లుక్‌ను కలిగి ఉంది. దీనిలో 1.5 అంగుళాల AMOLED డిస్‌ప్లే, పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 3,000 నిట్స్ ఉండటంతో.. ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గీతలు పడకుండా ఉండేలా టఫ్డ్ గ్లాస్, ఫింగర్‌ప్రింట్ పడకుండా యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్ వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. నావిగేషన్ కోసం వాచ్ కుడివైపున రెండు బటన్లతో పాటు స్మూత్ అనుభూతినిచ్చే రోటర్ మోటారు కూడా ఉంది.

Advertisement

Also Read: మార్కెట్లోకి Poco X8 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా:

ఈ స్మార్ట్‌వాచ్‌లో అత్యాధునిక బయోట్రాకర్ PPG బయోమెట్రిక్ సెన్సార్ ఉంది. ఇది 24 గంటల హార్ట్ రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, స్ట్రెస్, శరీర ఉష్ణోగ్రతను నిరంతరం పర్యవేక్షిస్తుంది. అంతేకాదు.. మెరుగైన నిద్ర కోసం స్లీప్ స్కోర్, నిద్ర దశలు, శ్వాస నాణ్యతను విశ్లేషించే స్లీప్ మానిటరింగ్ ఫీచర్ కూడా దీనిలో ఉంది. 5 రకాల శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్స్ ఉండటం వల్ల ట్రాకింగ్ చాలా ఖచ్చితంగా జరుగుతుంది.

25 రోజుల బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఈ Amazfit Active Max వాచ్‌లో 658mAh బ్యాటరీని అమర్చారు. దీంతో వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 25 రోజుల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. భారీగా వాడితే 13 రోజులు, నిత్యం ఆన్‌లో ఉండే డిస్‌ప్లే మోడ్‌లో 10 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది. ఒకవేళ కంటిన్యూగా GPS వాడినా 64 గంటల పాటు ఇది ఆక్టివ్‌గా ఉంటుంది.

ధర ఎంతంటే?

భారత్‌లో అమాజ్‌ఫిట్ యాక్టివ్ మాక్స్ ధర రూ.15,999. ఈ వాచ్ ప్రస్తుతం బ్లాక్ కలర్ ఆప్షన్‌లో కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంది. 5ATM వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ వల్ల ఈ వాచ్ చేతికి పెట్టుకునే స్విమ్మింగ్ కూడా చేయవచ్చు.

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 13పై ఊహించని డిస్కౌంట్, స్టాక్ అయిపోయేలోపు కొనేయండి!

 

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×