E-Paper
Advertisement

Tollywood: దర్శకుడు శంకర్ కి మాతృవియోగం!

Tollywood: దర్శకుడు శంకర్ కి మాతృవియోగం!
Advertisement

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అనారోగ్య కారణాలవల్ల తుదిశ్వాస విడిస్తే.. మరి కొంతమంది ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడుస్తున్నారు. ఇంకొంతమంది వయస్సు మీద పడడంతో వృద్ధాప్య కారణాలవల్ల స్వర్గస్తులవుతున్నారు. అటు సెలబ్రిటీల మరణాలే కాదు.. సెలబ్రిటీలకు చెందిన కుటుంబ సభ్యుల మరణాలు కూడా అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి .ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడికి మాతృవియోగం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

దర్శకుడికి మాతృవియోగం..

ఆయన ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్. భద్రాచలం, శ్రీ రాములయ్య, ఆయుధం, జయం మనదే రా, జై బోలో తెలంగాణ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ఎన్ శంకర్. 2026 జనవరి 28న ఎన్ శంకర్ మాతృమూర్తి నిమ్మల సక్కుబాయమ్మ పరమపదించారు. ఆమె మరణంతో ఎన్. శంకర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిమ్మల సక్కుబాయమ్మ అంత్యక్రియలు 2026 జనవరి 29 గురువారం మధ్యాహ్నం జరుగుతాయి. రేపు ఉదయం నుండి HIG బ్లాక్ 11, చిత్రపురి కాలనీ హైదరాబాదులో భౌతిక కాయాన్ని సందర్శించవచ్చు. దర్శకుడికి మాతృవియోగం అని తెలియడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీ సక్కుబాయమ్మ మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఎన్ శంకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఎన్.శంకర్ సినీ ప్రయాణం..

Advertisement

నిమ్మల శంకర్.. దర్శకుడిగానే కాదు రచయితగా, నిర్మాతగా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. జయం మనదేరా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన.. కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్ లోనే తనదైన కమిట్మెంట్ తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించి.. మంచి పేరు ఘడించారు. 2011లో శంకర్ తీసిన జై బోలో తెలంగాణ చిత్రానికి ఏకంగా ఐదు నంది అవార్డులు లభించాయి. 2011 సెప్టెంబర్ లో గోవాలో జరిగిన 6వ దక్షిణాసియా చలన చిత్రోత్సవంలో కూడా ఇది ప్రదర్శించబడింది. ఇకపోతే ఈ చిత్రాన్ని తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సమకాలీన పరిణామాలు, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని కథగా అల్లుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమాకి “మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్” గా ప్రశంసలు లభించాయి.

ALSO READ:Balakrishna: సూపర్ స్టార్ ను అనుకరించి నవ్వుల పాలైన బాలయ్య.. వీడియో వైరల్!

ఎన్. శంకర్ నటించిన చిత్రాలు..

Advertisement

దర్శకుడిగా 2 కంట్రీస్, జై బోలో తెలంగాణ, ఆయుధం, జయం మనదేరా, శ్రీరాములయ్య, ఎన్కౌంటర్, భద్రాచలం, యమజాతకుడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన నటుడిగా కూడా నటించారు. రామ్ కీ హీరోగా కత్తి మహేష్ దర్శకత్వంలో రూపొందిన ‘రిపోర్టర్’ సినిమా ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇకపోతే ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీకి సభ్యుడిగా వ్యవహరించారు. నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యుడిగా వ్యవహరించిన ఈయన.. ఒకసారి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×