E-Paper

అస్సాంలో ఘోర ప్రమాదం.. జోర్హాట్ ఐఏఎఫ్ బేస్‌లో కుప్పకూలిన కార్గో విమానం!

అస్సాంలో ఘోర  ప్రమాదం.. జోర్హాట్ ఐఏఎఫ్ బేస్‌లో కుప్పకూలిన కార్గో విమానం!

Plane Crash: అస్సాంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జోర్హాట్‌లోని భారత వైమానిక స్థావరంలో గురువారం ఒక సైనిక రవాణా విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. భారత సైన్యానికి రక్షణ సామాగ్రి, నిత్యావసరాలను చేరవేసేందుకు ఉపయోగించే ఏఎన్-31 (AN-31) కార్గో విమానంగా దీనిని గుర్తించారు. సాంకేతిక లోపమా లేక వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంలో విమాన పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని రక్షణ శాఖ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే వైమానిక దళానికి చెందిన ప్రత్యేక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విమాన శకలాల నుంచి పైలట్‌ను వెలికితీసే ప్రయత్నాలు సాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం సేవలందించే ఇలాంటి కార్గో విమానం ప్రమాదానికి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: అందినకాడికి దోచేసి.. ఇప్పుడు నీతులు చెప్తారా? హరీష్ రావుపై ఎమ్మెల్యే గండ్ర ఫైర్!

Related News

Meenakshi Natarajan: మీనాక్షి నాటరాజన్‌కు ఎదురుదెబ్బ.. జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

తెరపైకి మళ్లీ డీలిమిటేషన్.. కొత్త ఫార్ములా దక్షిణాదికి లాభమా? నష్టమా? పార్టీలు ఏమంటున్నాయి?

బెంగాల్‌‌లో ఏం జరుగుతోంది? బూడిదైన 4 వేల ఈవీఎంలు, ఎవరి పని? నివేదిక కోరిన సీఈసీ

స్కూల్లో రైడ్.. రూ.కోటి నగదు, మద్యం, కం*డోమ్స్ లభ్యం.. పోలీసులకే మైండ్ బ్లాక్!

కాక్రోచ్‌ జనతా పార్టీ దేశవ్యాప్త ఉద్యమం.. ఎడ్యుకేషన్ వ్యవస్థపై ఫోకస్, జూన్ 20 జంతర్ మంతర్ వద్ద ఆందోళన

నీట్ లీకేజీలపై రాహుల్ గాంధీ పోరాటం.. యువతకు అండగా కాంగ్రెస్- మల్లిఖార్జున ఖర్గే

మీనాక్షి నటరాజన్‌ ఇష్యూ కొత్త మలుపు.. నేరుగా సుప్రీంకోర్టుకు, రిలీఫ్ లభిస్తుందా?

×