E-Paper
Advertisement

PR Performance: రూటు మార్చిన రేవంత్ సర్కార్.. ప్రైవేట్ ఎక్స్‌పర్ట్స్‌తో ప్రజాభవన్‌లో ప్రత్యేక శిక్షణ!

PR Performance: రూటు మార్చిన రేవంత్ సర్కార్.. ప్రైవేట్ ఎక్స్‌పర్ట్స్‌తో ప్రజాభవన్‌లో ప్రత్యేక శిక్షణ!
Advertisement

PR Performance: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు,పరిపాలనా సంస్కరణలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదనే అసంతృప్తి సీఎంలో ఉన్నది. ప్రభుత్వం ఊహించిన దాని కంటే అత్యధికంగా పనిచేస్తున్నప్పటికీ, ఆశీంచిన స్థాయిలో మైలేజ్ రావడం లేదని సీఎం గుర్రుగా ఉన్నారు. సంక్షేమ పథకాలు, డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ గతం కంటే మెరుగ్గా చేస్తున్నప్పటికీ, సర్కార్ పై విమర్శలు రావడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రాథమికంగా గుర్తించిన సీఎం.. కొందరు పీఆర్ వోలపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. చేసిన పనులను సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని, పీఆర్ వోలు కూడా సీరియస్ గా డ్రైవ్ చేయలేకపోతున్నారని స్వయంగా సీఎం గాంధీభవన్ లోని పీఏసీ మీటింగ్‌లో అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ప్రైవేట్ ఎక్స్ పర్ట్స్‌తో..

సీఎంవోలోని మీడియా రిలేషన్ టీమ్ తో పాటు కొంత మంది మంత్రుల వద్ద పనిచేస్తున్న వారిలో కొందరు ఆశీంచిన స్థాయిలో వర్క్ చేయడం లేదని సీఎం కు ఫీడ్ బ్యాక్ వెళ్లింది. సీఎం ఆదేశాలతోనే తాజాగా ఇద్దరు ప్రైవేట్ ఎక్స్ పర్ట్స్ తో ప్రజాభవన్ లో పీఆర్వోలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ప్రభుత్వానికి మైలేజ్ వచ్చేలా చేయాల్సిన యాక్టివిటీస్ పై ఆ ఇద్దరు ఎక్స్ పర్ట్స్ తో పాటు సీనియర్ పీఆర్ వోలు వివరించారు. ఇక నుంచి మరింత యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉన్నట్లు వివరించారు. సోషల్ మీడియాతో పాటు వార్తలను ఎలా డ్రాఫ్ట్ చేయాలి? నెగెటివ్ వార్తలకు ఎలా కౌంటర్ చేయాలి? అనే అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం ఏం జరుగుతుంది..?

Advertisement

ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టడంలో, ప్రభుత్వ విధానాలను జనంలోకి తీసుకెళ్లడంలో సాంప్రదాయ పద్ధతుల్లోనే వెళ్తున్నారే తప్ప, మారుతున్న ట్రెండ్స్ కు అనుగుణంగా అప్‌డేట్ కావడం లేదని సీఎం లో అసంతృప్తి ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇదే అంశాన్ని గాంధీభవన్ లో సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. ఇక ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు విస్తృతంగా పబ్లిసిటీ కావడం లేదనే చర్చ ఉన్నది. అన్ని సంస్థల మీడియాలను సమన్వయం చేయడంలోనూ పీఆర్ వోలు కూడా విఫలమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సర్కార్ చేసే మంచి కొంత వరకు మాత్రమే మీడియా మాధ్యమాల ద్వారాప్రజల్లోకి వెళ్లగలుతుంది. ప్రభుత్వం చేసే మంచి పనులను అన్ని మీడియా సంస్థలకు చేరవేయడంలో పీఆర్ వోలకు ఉన్న అభ్యంతరం ఏమిటనే దానిపై కూడా సీఎంవో ఆరా తీస్తుంది. కొందరు పీఆర్ వోలు ప్రభుత్వానికి, మీడియాకు మధ్య గ్యాప్ తీసుకువస్తున్నారనే చర్చ కూడా ఉన్నది. పీఆర్ వోలకు పర్సనల్ గా ప్రెండ్పీప్ ఉన్న సంస్థలకు మాత్రమే విషయాలను వెల్లడించి, మిగతా సంస్థలకు దాట వేసే దోరణిని ప్రదర్శించడం వలన సర్కార్ కు డ్యామేజ్ జరుగుతుందని కొందరు ముఖ్య నేతలు సైతం పీఏసీ మీటింగ్ లో వివరించారు.

Also Read: HYDRAA: హైదరాబాద్‌కు కొత్తగా మెట్ ఎమర్జెన్సీ టీమ్స్.. రంగంలోకి 51 బృందాలు..!

సీఎం అసంతృప్తి..

Advertisement

వాస్తవానికి గత ప్రభుత్వంతో పోల్చితే ఈ సర్కార్ సంక్షేమ పథకాలు, పేదలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే పెండింగ్ నిర్ణయాలను స్పీడప్ చేసింది. సర్కార్ కు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే లక్ష్యంతో సర్కార్ గా పనిచేస్తుంది. పక్కా ప్లానింగ్‌తో లక్ష్​యాలను ఛేధిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న మంచి చేస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు కావాలనే చేస్తున్న చెడు సొసైటీలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది. దీనిపై సీఎం అసంతృప్తిని వ్యక్తపరిచారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచే మీడియాతో ప్రెండ్లీ రిలేషన్ మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు, పరిష్​కారాలు, ప్రజల నాడీ పట్టుకునేందుకు మీడియాను వేదికగా వాడుతుంటారు. కానీ కొందరు పీఆర్ వోలు చేస్తున్న ‘విభజన విధానాల’తో సర్కార్ కు చెడ్డపేరు వస్తుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది.

ఇకపై పర్సనల్ టీం నజర్..

​ఇన్నాళ్లూ పీఆర్ వోల వదిలేసిన సీఎం.. ఇకపై రూట్ మార్చబోతున్నారు. మంత్రుల పేషీల్లోని పీఆర్ వోల యాక్టివిటీస్, ప్రెస్ నోట్స్, సోషల్ మీడియా పోస్టులను ఇక నుంచి సీఎం పర్సనల్ టీం నేరుగా మానిటరింగ్ చేయనుంది. ఏ రోజు ఏ మంత్రి పేషీ నుంచి ఎలాంటి మైలేజ్ వచ్చింది? ప్రభుత్వం గ్రాఫ్ పెంచేలా ఎలాంటి స్టోరీలు ప్లాన్ చేశారు? అనేదానిపై నిరంతరం నిఘా ఉండబోతోంది.అంతేగాక ప్రభుత్వానికి మైలేజ్ వచ్చేలా ఆయా పీఆర్వోల కృషి ఏమేరకు ఉన్నదనే అంశంపై కూడా ఈ టీమ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించనున్నది. పీఆర్ వోల పనితీరుపై వీక్లీ రిపోర్ట్స్ కూడా సీఎం టేబుల్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత తెలిపారు. ఆశీంచిన స్థాయిలో క్రియేటివిటీ చూపించకపోయినా, ప్రభుత్వానికి మైలేజ్ తేలేకపోయినా.. సదరు పీఆర్ వోలను పక్కన పెట్టి కొత్త వాళ్లను తెచ్చుకోవడానికి కూడా సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Also read: గోల్డ్ షాప్‌లోకి చొరబడి.. పెప్పర్ స్ప్రే కొట్టి.. యువతులు వీరంగం!

Related News

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

ఒక్కడివే నామినేషన్ ఫిల్ చెయ్ చూద్దాం.. సీఎం రేవంత్‌కి బిజెపి ఎంపీ ఓపెన్ ఛాలెంజ్!

ఎల్లంపేట్‌‌ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!

అమెరికాలో భట్టి విక్రమార్క హవా.. డల్లాస్‌లో గ్రాండ్ వెల్‌కమ్!

సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!

నాగర్‌కర్నూల్‌లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!

ఫరీదాబాద్‌లో ఘోరం.. లేడీ టీచర్‌ను 30 సెకన్లలో 25 సార్లు పొడిచి చంపేశాడు!

Big Stories

Advertisement
×