Women’s T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (Women’s T20 World Cup 2026 Tournament) నిన్న షురూ అయింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో తొలి మ్యాచ్ మహిళల ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల (England Women vs Sri Lanka Women) మధ్య జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ 87 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా లెస్బియన్ క్రికెటర్ డాని వ్యాట్-హాడ్జ్ (Danni Wyatt-Hodge) సెంచరీ చేసి రెచ్చిపోయింది. 62 బంతుల్లోనే 105 పరుగులు సాధించి.. ఇంగ్లాండ్ ను విజయ తీరాలకు చేర్చింది. ఈ క్రమంలోనే ఇటీవల జన్మించిన తన కూతురికి ఈ సెంచరీ అంకితం చేస్తూ ఎమోషనల్ అయింది లెస్బియన్ క్రికెటర్ డాని వ్యాట్-హాడ్జ్. ఈ క్రమంలో ఆమె చేసుకున్న సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి.
ఇంగ్లాండ్ లెస్బియన్ క్రికెటర్ డాని వ్యాట్-హాడ్జ్ (Danni Wyatt-Hodge), జార్జీ హాడ్జ్ (Georgie Hodge) ఇద్దరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2019లో ప్రేమలో పడిన ఈ ఇద్దరు… 2023 సంవత్సరం ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2024 జూన్ మాసంలో లండన్ లోని చర్చిలో అధికారికంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ జంటకు 2026 మే 20వ తేదీన అంటే 23 రోజుల కిందట ఓ పండంటి ఆడబిడ్డ జన్మించింది. దీంతో ఇంగ్లాండు లెస్బియన్ క్రికెటర్ డాని వ్యాట్-హాడ్జ్ తలయ్యారు. అయితే 23 రోజుల కిందట తల్లైనా ఆమె… నిన్న టి20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ సందర్భంగా శ్రీలంక మహిళల జట్టుపై సెంచరీ చేశారు. సెంచరీ చేసిన అనంతరం తన కూతురికి ఇన్నింగ్స్ ను అంకితం చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు డాని వ్యాట్-హాడ్జ్. ఈ క్రమంలో ఆమె చేసిన సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ లోనే బోనీ కొట్టింది మహిళల ఇంగ్లాండ్ జట్టు. నిన్న శ్రీలంకపై ఏకంగా 87 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన మహిళల ఇంగ్లాండ్ జట్టు నిర్నిత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో ఒకే ఒక్క వికెట్ నష్టపోయి 219 పరుగులు చేసింది. ఈ సందర్భంగా డాన్ని సెంచరీ చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 20 ఓవర్లలో 132 పరుగులు చేసి కుప్పకూలింది శ్రీలంక మహిళల జట్టు. దీంతో అవలీలగా ఇంగ్లాండ్ విక్టరీ సాధించగలిగింది.
🚨 HISTORY CREATE BY DANNI WYATT HODGE 🚨
– Danni Wyatt-Hodge smashed first hundred of Women's WC cricket. 🔥🤯
Just look at the calebration of Danni -Wyatt-Hodge 😭♥️ pic.twitter.com/pQ8GBLCRIZ
— lndian Sports Netwrk (@IS_Netwrk29) June 13, 2026