E-Paper
Advertisement

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..పూర్తి వివరాలు ఇవే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..పూర్తి వివరాలు ఇవే!
Advertisement

Bank of Baroda Recruitment 2026:  బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు ఇది అదిరిపోయే గుడ్‌న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘బ్యాంక్ ఆఫ్ బరోడా ‘  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ, సెక్యూరిటీ, అకౌంట్స్ వంటి వివిధ విభాగాల్లో మొత్తం 206 ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం.

పోస్టులు, ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 206 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో.. డిజిటల్ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ అకౌంట్స్ లాంటి కీలక విభాగాల్లో 22 రకాల ఖాళీలు ఉన్నాయి. ముఖ్యంగా సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, ఐటీ ఆఫీసర్లు, డేటా సైంటిస్టులు, అకౌంట్స్ అండ్ టాక్సేషన్ మేనేజర్లు, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు ఇందులో ఉన్నాయి.

2. విద్యార్హతలు ,అనుభవం:

Advertisement

దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి.

బీఈ/బీటెక్ (కంప్యూటర్స్, ఐటీ, సివిల్, ఎలక్ట్రికల్), ఎంసీఏ, లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా అకౌంట్స్, టాక్సేషన్ పోస్టులకు CA లేదా ICWA కంప్లీట్ చేసి ఉండాలి. పోస్టు స్థాయిని బట్టి 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా అడిగారు.

3. వయోపరిమితి, రిజర్వేషన్:

Advertisement

అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2026 నాటికి, పోస్టును బట్టి కనీసం 23 సంవత్సరాల నుంచి గరిష్టంగా 43 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.

4. ఎంపిక ప్రక్రియ :

1.ముందుగా వచ్చిన దరఖాస్తులను అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

2.అవసరాన్ని బట్టి ముందుగా ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించవచ్చు.

3. అందులో క్వాలిఫై అయిన వారికి సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలెక్షన్ చేస్తారు.

5. జీతం:

ఎంపికైన అభ్యర్థులకు JMG/S-I నుంచి SMG/S-IV గ్రేడ్‌ల వరకు బేసిక్ పే స్కేల్ వర్తిస్తుంది. అంటే బేసిక్ పే రూ. 48,480 నుంచి ప్రారంభమై రూ. 1,20,940 వరకు ఉంటుంది. దీనికి తోడు హెచ్‌ఆర్‌ఏ, డీఏ తదితర బ్యాంక్ అలవెన్సులు అదనంగా కూడా లభిస్తాయి.

6. దరఖాస్తు ఫీజు :

ఫీజు వివరాలు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు కేవలం రూ. 175 ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 6 వ తేదీ నుంచి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి.

చివరి తేదీ: ఆగస్టు 26 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

7. ఇంటర్వ్యూకి కావాల్సిన డాక్యుమెంట్లు:

ఎంపికైన వారు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ అవుట్, బర్త్ సర్టిఫికెట్ , విద్యా సంబంధిత సర్టిఫికెట్లు, క్యాస్ట్, ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అలాగే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, లేదా పాస్‌పోర్ట్ వంటి ఏదైనా ప్రభుత్వ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను వెంట తీసుకెళ్లాలి.

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×