E-Paper
Advertisement

లోకల్ రైలులో దారుణం.. సీటు కోసం మహిళపై బెల్టుతో దాడి.. ఎంతకు తెగించావ్ రా!

లోకల్ రైలులో దారుణం.. సీటు కోసం మహిళపై బెల్టుతో దాడి.. ఎంతకు తెగించావ్ రా!
Advertisement

Mumbai Train Fight: మహారాష్ట్ర ముంబయిలోని లోకల్ రైలులో సీటు విషయమై జరిగిన వివాదం.. ఒక మహిళపై భౌతిక దాడికి దారితీసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తోటి ప్రయాణికురాలిపై దాడికి పాల్పడిన 36 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే?

గోరేగావ్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వైపు వెళ్తున్న హార్బర్ లైన్ లోకల్ రైలులో ఈ ఘటన జరిగింది. బుధవారం (ఆగస్టు 5) సాయంత్రం సుమారు 5:30 గంటల ప్రాంతంలో రైలులో సీటు కోసం వాగ్వాదం మెుదలైంది. నిందితుడైన మహమ్మద్ రిజ్వాన్ అన్సారీ, ఒక మహిళా ప్రయాణికురాలితో గొడవకు దిగాడు.

Advertisement

చేతులతో, బెల్టుతో దాడి

ఈ క్రమంలో మహిళపై కోపంతో రగిలిపోయిన అన్సారీ.. చేతులతో పాటు తన బెల్టుతో ఆమెపై దాడి చేశాడు. దాడి చేయడంతో పాటు తీవ్ర పదజాలంతో దూషించాడు. ఈ దాడి జరుగుతున్న సమయంలోనే రైలులోని మరో ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో ఈ ఘోరాన్ని వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

Advertisement

Also Read: మెగా డీఎస్సీ కాదు.. అదొక ‘దగా డీఎస్సీ’.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రోజా!

కేసు నమోదు.. ఆపై అరెస్టు

వీడియో నెట్టింట వైరల్ కావడంతో వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై అంధేరీ రైల్వే పోలీస్ (GRP) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియో దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా దాడికి పాల్పడిన వ్యక్తిని అన్సారీగా గుర్తించారు. అనంతరం అతడ్ని ముంబయిలోని వడాలా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశామని.. దాడి ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు.. గిన్నిస్ రికార్డ్ బద్దలుకొట్టిన భారతీయ మహిళ

Tags

Related News

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

హోటల్ గదిలో చెక్ ఇన్ చేశాక ఈ 5 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి.. లేకపోతే ప్రమాదకరం

Big Stories

Advertisement
×