E-Paper
Advertisement

తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాలు… తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్

తవ్వకాల్లో దొరికిన అస్థిపంజరాలు… తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్న తమిళ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Mystery Crime thriller: ఓ హైవే నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో బయటపడిన కొన్ని అస్థిపంజరాలు.. వాటి వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలు.. ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఓ పోలీస్ ఆఫీసర్.. అసలు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఇలాంటి ప్రశ్నలతో సాగే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘వదంతి సీజన్ 2: ది మిస్టరీ ఆఫ్ మణి’. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించగా, పుష్కర్-గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఈసారి ఎమ్. శశికుమార్ ప్రధాన పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ తమిళ సిరీస్ ను తెలుగులో ఎక్కడ చూడొచ్చు అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మధురై గ్రామీణ ప్రాంతంలో కొత్త హైవే నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా, అక్కడ కొన్ని మనుషుల పాత అస్థిపంజరాలు బయటపడతాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించడంతో, కేసు దర్యాప్తు బాధ్యతలు ఎస్.ఐ మూసా రాజాకు అప్పగిస్తారు. గతంలో ఓ పొలిటికల్ కేసును తప్పుగా ఇన్వెస్టిగేట్ చేశాడనే కారణంతో శిక్షగా మారుమూల ప్రాంతానికి బదిలీ అయిన రాజాకు, ఈ కేసు ఒక సాధారణ దర్యాప్తులా మొదలవుతుంది. కానీ విచారణ ముందుకు సాగేకొద్దీ అనేక అనుమానాలు తెరపైకి వస్తాయి.

Advertisement

ఈ హత్యలకు జైల్లో ఉన్న మణి అనే ఖైదీతో సంబంధం ఉన్నట్లు కొన్ని ఆధారాలు బయటపడతాయి. అయితే మణి మాత్రం తనకు తెలిసిన విషయాలను చెప్పడానికి సిద్ధపడడు. అస్థిపంజరాలు ఎవరివి? మణి ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఈ హత్యల వెనుక అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలు రాజా దర్యాప్తును మరింత సంక్లిష్టంగా మారుస్తాయి.

కేసును మరింత పరిశీలిస్తున్న సమయంలో రాజా గతంలో క్లోజ్ చేసిన ఒక పొలిటికల్ కేసుకు సంబంధించిన షాకింగ్ నిజం బయటపడుతుంది. తన నిర్ణయం కారణంగా ఒక అమాయకుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడని అతనికి తెలుస్తుంది. దీంతో ఈ కేసు కేవలం హత్యల దర్యాప్తుగా కాకుండా, తన గత తప్పులను సరిదిద్దుకునే పోరాటంగా కూడా మారుతుంది. రాజకీయ ఒత్తిళ్లు, వ్యవస్థలోని లోపాలు, దాగి ఉన్న నేరాల మధ్య అసలైన సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి రాజా చేసే ప్రయత్నమే సిరీస్‌ లో చూసి తెలుసుకోవాలి.

Advertisement

సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా చివరి భాగాల్లో వచ్చే ట్విస్టులు కథపై ఆసక్తిని మరింత పెంచుతాయి. మధురై పల్లెటూరి వాతావరణం, జల్లీకట్టు నేపథ్యం, సైమన్ కె. కింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సస్పెన్స్‌ను బలపరుస్తాయి. శశికుమార్‌తో పాటు అపర్ణ దాస్, అనఘా మరుతోర, యశ్వంత్, వివేక్ ప్రసన్న, రేవతి శర్మ కీలక పాత్రల్లో నటించారు.

మొదటి సీజన్‌కు భిన్నమైన కొత్త కథతో సీజన్ 2 ప్రేక్షకులను మరో మిస్టరీలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ప్రతి ఆధారం మరో ప్రశ్నకు దారి తీస్తుంది. ఒక వ్యక్తి చెప్పిన మాట నిజమా, లేక వదంతిగా మారిన కథలో మరో నిజం దాగి ఉందా అనే సందేహం కొనసాగుతుంది. పోలీస్ విచారణలో ఎదురయ్యే ఒత్తిళ్లు, రాజకీయ ప్రభావాలు, వ్యక్తిగత బాధ్యతల మధ్య మూసా రాజా తీసుకునే నిర్ణయాలు కథకు భావోద్వేగ బలాన్ని ఇస్తాయి. అందుకే క్రైమ్ మిస్టరీతో పాటు పాత్రల ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా అనిపించొచ్చు. ప్రతి ఎపిసోడ్‌లో క్లూ రావడంతో ప్రేక్షకుల ఊహలకు పని చెబుతూ, చివరి వరకు సస్పెన్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది సిరీస్.

తెలుగులోనూ స్ట్రీమింగ్

హడావుడి యాక్షన్ కంటే ఆధారాలు, అనుమానాలు, విచారణ, పాత్రల మానసిక సంఘర్షణలతో కథను నడిపించే క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి ‘వదంతి సీజన్ 2’ వర్త్ వాచింగ్ మూవీ అనిపిస్తుంది. ముఖ్యంగా అస్థిపంజరాల మిస్టరీ, మణి పాత్ర చుట్టూ పెరిగే ప్రశ్నలు చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తాయి. నిజం బయటపడే వరకు ఎవ్వరినీ పూర్తిగా నమ్మలేని విధంగా కథను మలిచిన తీరు అద్భుతం. ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో చూడొచ్చు.

Read Also: సాతాను పేరు చెప్పి సరదాగా మొదలు పెడితే ఊరంతా నరకం… 8 ఎపిసోడ్ల హారర్ థ్రిల్లర్

Related News

అమ్మాయి ఆత్మహత్య వెనుక అంతర్జాతీయ కుట్ర… తెలుగులోనే ఉంది ఈ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్

భర్త మీద అలిగి నదికిపోతే… 15 నిమిషాలే… కానీ గుండెల్లో దడ పుట్టించే హారర్ షార్ట్ ఫిల్మ్

చికెన్ అంటే ఇష్టమా?… నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే షాకింగ్ డాక్యుమెంటరీ

ఆస్తి కోసం వెళ్తే బయటపడే అమ్మ సీక్రెట్ లవ్ స్టోరీ… డీఎన్ఏ టెస్ట్ తో దిమ్మతిరిగే ట్విస్ట్

95 ఏళ్ల తాత చివరి కోరిక కోసం పాక్ కు మనవడు… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

రిసార్ట్‌కు రిలాక్స్ అవ్వడానికెళ్తే ఇదేం ట్విస్ట్ భయ్యా… ఊహించని క్లైమాక్స్

పాతబావిలో ఉన్న నిధి కోసం ఊరంతా పోట్లాట… చివరికి బయటపడింది ఏంటో తెలిస్తే బుర్రపాడు

Big Stories

Advertisement
×