E-Paper
Advertisement

వెనక్కి తగ్గిన సీఎం విజయ్.. ఆ నియామకం రద్దు, వెనుక ఏం జరిగింది?

వెనక్కి తగ్గిన సీఎం విజయ్.. ఆ నియామకం రద్దు, వెనుక ఏం జరిగింది?
Advertisement

CM Vijay: ఆదిలో తమిళనాడు సీఎం విజయ్ వేసిన అడుగు బూమరాంగ్ అయ్యిందా? పొలిటికల్ పరీక్షలో పాసైన ఆయన, నిర్ణయం తీసుకోవడం విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? విపక్షాల ఒత్తిడితో వెనక్కి తగ్గారా? అనుభవం లేకపోవడమే దీనికి కారణమా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

బల పరీక్షలో విజయ్.. ఆపై వెనక్కి తగ్గిన సీఎం విజయ్

Advertisement

సీఎం విజయ్ అధికారంలోకి రెండో రోజు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాదు ప్రత్యర్థులకు అస్త్రాన్ని అందజేశారు. విపక్షాలతోపాటు మద్దతు ఇచ్చినవారు సైతం ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టారు ఫలితంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

బుధవారం ఉదయం అసెంబ్లీలో బలపరీక్షలో విజయం సాధించిన వెంటనే టీవీకే ప్రభుత్వం, జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ నియామకం విషయంలో జరిగిన పొరపాటును దిద్దుకునే ప్రయత్నం చేసింది. ఫలితంగా ఆయన నియమాకాన్ని రద్దు చేసింది. రాధన్ పండిట్‌ని ముఖ్యమంత్రి తన ఓఎస్డీగా నియమించడం పెను దుమారం రేపింది.

Advertisement

సీఎం ఓఎస్ఢీ నియామకం రద్దు, వెనుక ఏం జరిగింది?

మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు, చివరకు ప్రజలు సైతం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుబట్టారు. కొన్ని గంటల్లో వ్యవధిలో ఆ నియామకాన్ని వెనక్కి తీసుకుంది. విశ్వాస పరీక్ష సందర్భంగా మాట్లాడిన డీఎండీకే చీఫ్ ప్రేమలత విజయకాంత్, జ్యోతిష్కుడు నియామకాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి తన ఓఎస్డీగా జ్యోతిష్కుడిని నియమించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు సభలో తెలిపారు.

ఈ విధంగా చేయడం ద్వారా యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత జ్యోతిష్కుడైతే వ్యక్తిగతంగా ఉంచాలని ప్రభుత్వంలో చోటు ఇవ్వడం ఏంటని ప్రశ్నలు లేవనెత్తారు. మద్దతిస్తున్న విడుతలై చిరుతైగల్ కట్చి-వీసీకే, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ALSO READ: నీట్ ‘లీక్’ రచ్చ.. సుప్రీంకోర్టుకు చేరిన లీకేజీ వివాదం.. NTA తీరుపై FAIMA ఫైర్!

దీనిపై సోషల్ మీడియాలో టీవీకే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. విమర్శలు తీవ్రంగా కావడంతో టీవీకే నేత నిర్మల్ కుమార్ ఈ నియామకాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. చివరకు విజయ్ ప్రభుత్వం వెనక్కితగ్గడంతో బీజేపీ కూడా పందించింది. రాధన్ పండిట్ వెట్రివేల్‌కు అన్ని రాజకీయ ప్రముఖులతో మంచి సంబంధాలున్నాయి. దివంగత సీఎం జయలలితకు ఆయన సలహాదారుగా ఉన్నట్లు చెబుతున్నారు.

 

 

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×