E-Paper
Advertisement

AC పేలుళ్లకు అసలు కారణం ఇదేనా? కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ 5 జాగ్రత్తలు పాటించకపోతే రిస్కే!

AC పేలుళ్లకు అసలు కారణం ఇదేనా? కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ 5 జాగ్రత్తలు పాటించకపోతే రిస్కే!
Advertisement

AC Safety Tips: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. పొద్దున 10 గంటలకే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఈ క్రమంలో బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. పోనీ ఇంట్లో ఉందామంటో గంటల కొద్ది ఏసీ ఆన్‌లో ఉండాల్సిందే. అయితే, ఈ మధ్య పేపర్లోనో, టీవీల్లోనో ఏసీలు పేలిపోతున్నాయనే వార్తలు చూస్తుంటే మనందరికీ ఒకటే టెన్షన్.. ఎప్పుడు ఏమవుతుందో అని. నిజానికి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతాయట. అందుకే, మన సేఫ్టీ కోసం విద్యుత్ శాఖ (EESL) కొన్ని కీలక సూచనలు చేసింది. ఏసీ వాడేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం రండి..

కూలింగ్ అంటే 16 డిగ్రీలు కాదు:

ఏసీ ఆన్ చేయగానే గది వెంటనే చల్లబడిపోవాలని చాలామంది 16 లేదా 18 డిగ్రీల దగ్గర పెడుతుంటారు. నిజానికి దీనివల్ల గది త్వరగా చల్లబడదు కదా, మెషిన్ మీద లోడ్ పెరిగి కంప్రెషర్ త్వరగా పాడవుతుంది. ఏసీ ఉష్ణోగ్రతను ఎప్పుడూ 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచాలి. ఈ పద్ధతి మనకు హాయినిస్తూనే.. కంప్రెషర్ మీద ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. అంతేకాదు.. ఏసీని 24 – 28 డిగ్రీల మధ్య ఉంచితే సుమారు 6 శాతం కరెంట్ బిల్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

వైరింగ్‌ విషయంలో జాగ్రత్త:

Advertisement

ఏసీ అనేది కరెంట్ ఎక్కువ తీసుకునే పరికరం. అందుకే దీనికి వాడే వైర్లు నాణ్యమైనవి అయి ఉండాలి. పాత వైర్లు వాడటం లేదా ఒకే ప్లగ్ పాయింట్ నుంచి ఏసీతో పాటు గీజర్, ఫ్రిజ్ లాంటివి వాడటం చేయకూడదు. ఇలా చేస్తే.. వైర్లు వేడెక్కి మంటలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉంటే స్టెబిలైజర్ వాడటం తప్పనిసరి.

Also Read: Wi-Fi AC ఏసీ అంటే లగ్జరీ కాదు.. టైం, కరెంట్ బిల్లును సేవ్ చేసే స్మార్ట్ టెక్నాలజీ!

ఏకధాటిగా ఏసీ వాడొద్దు:

Advertisement

మరీ ఎండగా ఉందని ఏసీని 15 – 20 గంటల పాటు ఆపకుండా వాడటం మంచిది కాదు. దీనివల్ల కంప్రెషర్ ఓవర్ హీట్ అవుతుంది. మధ్య మధ్యలో కొంచెం సేపు గ్యాప్ ఇవ్వడం లేదా టైమర్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే బయట ఉండే అవుట్‌డోర్ యూనిట్‌కు గాలి తగిలేలా చూసుకోవాలి. దాన్ని ఇరుకైన ప్రదేశాల్లో పెట్టడం వల్ల మెషిన్ లోపల వేడి పెరిగిపోయి ప్రమాదాలకు దారి తీస్తుంది.

సర్వీసింగ్‌లో నిర్లక్ష్యం తగదు:

ఏసీ ఫిల్టర్లలో దుమ్ము చేరితే మెషిన్ గాలిని లాగడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే ఈ వేసవిలో కనీసం 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయండి. అలాగే సీజన్ మొదలయ్యే ముందే ప్రొఫెషనల్ టెక్నీషియన్‌తో సర్వీసింగ్ చేయించుకోండి. ఎక్కడైనా గ్యాస్ లీక్ అవుతుందా? వైర్లు ఎక్కడైనా కట్ అయ్యాయా? అనేది ముందే తెలుస్తుంది. లోకల్ మెకానిక్స్ కాకుండా గుర్తింపు పొందిన వారితోనే రిపేర్లు చేయించడం సేఫ్.

ఈ సంకేతాలు వినిపిస్తే..

ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు వింత శబ్దాలు వస్తున్నా, మాడిపోయిన వాసన వస్తున్నా, లేదా ఏసీ వేసిన కాసేపటికే పవర్ ట్రిప్ అవుతున్నా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఏసీ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయాలి. ఇలాంటివి పెద్ద ప్రమాదానికి ముందు వచ్చే హెచ్చరికలు. తర్వాత వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించి ఏసీ కండీషన్ ఎలా ఉందో చూడమని చెప్పాలి. అప్పుడే ఏసీ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.

Also Read: ఇన్‌స్టా రీల్స్‌ చూసి AC గదిలో బకెట్‌‌ నీళ్లు పెడుతున్నారా? వైద్యులు చెబుతున్న ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే..

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×