E-Paper
Advertisement

రాయచోటి నుంచి టాలీవుడ్ హీరోగా…హీరో సువిక్షిత్ ఇంటర్వ్యూ

రాయచోటి నుంచి టాలీవుడ్ హీరోగా…హీరో సువిక్షిత్ ఇంటర్వ్యూ
Advertisement

Dooradarshini Interview : సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం హీరో సువిక్షిత్‌ చిత్ర విశేషాలను ఇదిగో ఇలా పంచుకున్నారు.

నేపథ్యం ఏమిటి?
కడప జిల్లా రాయచోటి. నాకు వ్యాపారం ఉంది. చిన్నప్పటి నుండి సినిమాలంటే పాషన్‌.. సినిమాలను చూసి ఇన్‌స్పయిర్‌ అయ్యే వాడిని. అనుకోకుండా ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను.

Advertisement

ఈ సినిమాలోకి హీరోగా ఎలా అవకాశం వచ్చింది?
రచయిత నారాయణ గారు, అరుణాచలంలో కలిసిన ఓ యాచకుడి జీవిత గాథ ఆధారంగా ఈకథను అనుకుని రాసుకున్నారు. అయితే మొదట ఈ సినిమాను వేరే హీరోతో చేద్దామని ప్లాన్‌ చేశాం. అయితే కథకు కొత్త హీరో అవసరం కాబట్టి నాకున్న ఇంట్రెస్ట్‌తో. ఆ పాత్రకు నేను సెట్‌ అవుతానని భావించి కథానాయకుడిగా నేనే నటించాను. ఇటీవల విడుదలైన టీజర్‌, పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని అనుకుంటున్నాను.

also read :రెంటల్ సిస్టమ్ VS పర్సంటేజ్ షేరింగ్.. కొండాపూర్ భేటీలో ఎగ్జిబిటర్ల వార్నింగ్.. టాలీవుడ్‌లో కొత్త రగడ!

Advertisement

మిమ్ములను మీరు ఈ కథ కోసం ఎలా మౌల్ట్‌ చేసుకున్నారు?
ఈ కథను నేను కూడా విన్నాను. 90 బ్యాక్‌ డ్రాప్‌లో నడిచే ఈ కథలో లీడ్‌ పాత్రకు అప్పట్లో ఎలాంటి అనుభూతి పొందామో తెలుసుకుని నటించాలి. ఆ అనుభూతి పొందిన వారిలో నేను కూడా ఉన్నాను. అందుకే నేనే చేస్తే సహజంగా ఉంటుందని భావించాను. నేను ఈసినిమాలో ప్రత్యేకంగా నటించలేదు. జస్ట్‌ ఆ టైమ్‌లో ఎలా ఉండాలో అలా బిహేవ్‌ చేశాను.

రిలీజ్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారా?
మేము ఎదో తక్కువ థియేటర్స్‌లో రిలీజ్‌ చేద్దాం అనుకున్నాను. ఇప్పడు దాదాపుగా 250పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం.

సినిమాలో హీరో , హీరోయిన్‌ చనిపోతారు అంటున్నారు? ఆ పాయింట్‌ను ఎందుకు రివీల్‌ చేశారు?
హీరో, హీరోయిన్ చనిపోయిన తరువాత హ్యపీ ఎండింగ్‌ ఎలా ఇచ్చాం. అసలు అరుణాచలంలోకి ఆ పెద్దాయన ఎలా వచ్చాడు? ఆయన జీవితంలో జరిగింది ఏమిటి అనేది కథ. సినిమాలో హీరో ఫాదర్‌గా ఆ పెద్దాయన పాత్ర కనిపిస్తుంది. 90లో ప్రతి ఒక్కరూ వాళ్ల ఊరిలో తిరిగొచ్చిన ఫీల్‌ కలుగుతుంది.

ఈ సినిమాలో హీరో పాత్రలో మీరే నటించడానికి కారణం ఏమిటి?
ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవాళ్లే. సహజత్వం కోసం కొత్తవాళ్లతో నటించాం. పేరున్న ఆర్టిస్టులు నటిస్తే పాత్రలు కనిపించవు. అతని పాపులారిటీ కనిపిస్తుంది. అందుకే నేచురాలిటి ఫీల్‌ కోసం కొత్తవాళ్లతో చేశాం.

also read :ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో ముదిరిన వివాదం.. ప్రెసిడెంట్‌కే తెలియకుండా సంతకాలు.. అసలేం జరుగుతోంది?

ఈ సినిమా వర్కింగ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ఏలా ఉంది?
ప్రతి సినిమాకు ఉండే కష్టాలు మాకు ఉన్నాయి. అయితే ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ అందరూ సపోర్ట్‌ చేశారు. కానీ ఈ రోజు సినిమాను విడుదల వరకు తీసుకరావడం మేము సాధించిన విజయంగా భావిస్తున్నాం. ఇక మంచి సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమాను క్వాలిటీ కోసం బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వటానికి టైమ్‌ తీసుకున్నాం.

యానాం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా నేచురల్‌గా లోకేషన్స్‌లో 90వ దశకం గుర్తొచ్చేలా సెట్‌లు వేసి ఈ సినిమా తీశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాదు.

90వ దశకం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడానికి రీజన్‌ ఏమిటి?
సిటీకి అలవాటు పడి అందరం మన మూలాలను, పల్లెట్లూర్లను మర్చిపోతున్నాం. అందుకే అందర్ని వెనక్కి తీసుకెళ్లి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తున్నాం. ఈ సినిమా చూసిన వారికి వాళ్ల సొంతూరు గుర్తుకొస్తుంది.

సినిమా టిక్కెట్‌తో పాటు కర్చీఫ్‌ ఇస్తామని అంటున్నారు?
ఈ సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఎమోషన్‌ చూసి ఎడ్వకుండా ఎవ్వరూ ఉండలేరు.

హీరోగా కంటిన్యూ చేస్తారా?
తప్పకుండా మంచి కథలతో సినిమాలు చేయాలని ఉంది.

అంటూ తన మనసులోని మాటలని పంచుకున్నారు హీరో సువిక్షిత్‌.చూడాలి మరి మే 15న విడుదల కాబోతున్న ఈ దూరదర్శని ప్రేక్షకులని ఏ మేరకి మెప్పిస్తుందో !

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×