Big Stories

Rahul Gandhi: ‘కలలు కనకండి.. ఎప్పటికీ అలా జరగనివ్వం’

Rahul Gandhi Comments: బీజేపీ, కేంద్రమంత్రి అమిత్ షా పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. మంగళవారం బింద్ లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, రద్దు చేస్తామని బీజేపీ నేతలు స్పష్టంగా చెప్పారని, అమిత్ షా కూడా చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం భారతదేశంలోని పేద ప్రజల ఆత్మ అని.. రాజ్యాంగాన్ని ఎవరూ ముట్టుకోలేరని, రాజ్యాంగాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఏదీ లేదని, కానీ, బీజేపీ వాళ్లు కలలు కంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు, అంబేద్కర్ తో కలిసి బ్రిటీష్ వారితో పోరాడి రాజ్యాంగాన్ని ప్రజల గొంతుగా నిర్మించామని, రాజ్యాంగాన్ని ఎప్పటికీ చెరిపివేయనివ్వబోమని, రైతులు మరియు కార్మికులు అలా ఎప్పటికీ జరగనివ్వబోరని రాహుల్ అన్నారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ నేతలు చెబుతున్నారని.. అలాంటప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేను ఎందుకు ప్రవైటీకరించారు.. అగ్నివీర్ ఎందుకు తీసుకొచ్చారంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

- Advertisement -

ఇదిలా ఉంటే.. 370పైగా మెజారిటీ వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ యోచిస్తోందని కాంగ్రెస్ మరియు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్వయంగా వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని చెప్పినా అది జరగదని గతవారం ప్రధాని మోదీ అన్నారు. ఎన్డీయేకు 400కు పైగా సీట్లు రావాలని తను పిలుపునిచ్చింది కేవలం కాంగ్రెస్, భారత కూటమి కుట్రలను ధ్వంసం చేయడమేనని ఆయన అన్నారు.

- Advertisement -

Also Read: అప్పుడు తండ్రికి కిడ్నీ ఇచ్చి వార్తల్లో నిలిచిన లాలూ కూతురు.. ఇప్పుడు మళ్లీ..

ఇటు అమిత్ షా కూడా స్పందిస్తూ రాజ్యాంగంపై కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆయన అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News