E-Paper
Advertisement

Cotton Candy Ban: పీచుమిఠాయితో కేన్సర్.. అందుకే నిషిద్ధం!

Cotton Candy Ban: పీచుమిఠాయితో కేన్సర్.. అందుకే నిషిద్ధం!
Advertisement
Cotton candy banned in Tamil Nadu

Cotton candy banned in Tamil Nadu: చూడటానికి దూదిపింజలా.. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే పీచుమిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? పిన్నలు, పెద్దలు అందరూ దాని కోసం ఎగబడేవారే. అయితే ఆ పీచుమిఠాయిని అదే పనిగా తిన్నారనుకోండి.. కేన్సర్ రావడం ఖాయం.

ఎందుకంటే కేన్సర్ కారకమైన రసాయన సమ్మేళనం పీచుమిఠాయిలో ఉందట. ఈ కారణంగానే తమిళనాడు ప్రభుత్వం పీచుమిఠాయి తయారీ, అమ్మకాలను నిషేధించింది. అక్కడి ఫుడ్ సేఫ్టీ అధికారులు పీచుమిఠాయి శాంపిళ్లకు పరీక్షలకు పంపారు. అందులో కేన్సర్ కారక రసాయన సమ్మేళనం రోడమిన్-బీ ఉన్నట్టు ఆ పరీక్షల్లో వెల్లడైంది.

Advertisement

రోడమిన్-బీ అనేది నీటిలోకరిగిపోయే కెమికల్. డై లాగా పనిచేస్తుంది. చిక్కటి గులాబీ వర్ణం కోసం పీచుమిఠాయి తయారీలో దీనిని వినియోగిస్తారు. రోడమిన్-బీ కలిగిన ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే శరీరం విషతుల్యమవుతుంది. కణజాలం, లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఆహారోత్పత్తుల్లో దీని వినియోగం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పీచుమిఠాయి తయారీ, అమ్మకాలపై తమిళనాడు సర్కారు నిషేధం విధించింది. దీనిని ఉల్లంఘిస్తే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

Read more: ఈ అలవాట్లతో మీ జీవితం ఆనందమయం.. !

Advertisement

అంతకు కొన్ని రోజుల ముందే పుదుచ్చేరి ప్రభుత్వం కూడా పీచుమిఠాయిని నిషేధించింది. పీచుమిఠాయిలో రోడమిన్-బీ ఆనవాళ్లు ఉన్నట్టు ఈ నెల 9న బయటపడటంతో ఈ చర్యలు తీసుకుంది.

Tags

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×