E-Paper
Advertisement

Nayantara’s LIC movie: భర్తకు భారీ షాక్ ఇచ్చిన నయనతార.. రెమ్యూనరేషన్‌ లో ‘తగ్గేదేలే’

Nayantara’s LIC movie: భర్తకు భారీ షాక్ ఇచ్చిన నయనతార.. రెమ్యూనరేషన్‌ లో ‘తగ్గేదేలే’
Advertisement

Nayantara Quits Husband Vignesh’s LIC movie: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా పేరు సంపాదించుకుంది నటి నయనతార. ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ మూవీలో నటించి అదరగొట్టేసింది. అందులో ఆమె మాస్ పవర్ ఫుల్ యాక్షన్ ప్రేక్షకాభిమానులను కట్టిపడేసింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఊహించని కలెక్షన్లను నమోదు చేసింది.

అయితే ఈ సినిమా తర్వాత ఆమె నటించిన కొన్ని సినిమాలు వివాదాలకు దారితీస్తున్నాయి. రీసెంట్‌గా ఆమె నటించిన ‘అన్నపూరణి’ సినిమా ఎన్నో వివాదాలకు దారి తీసింది. ఇక నేరుగా ఓటీటీలోకి రావాల్సిన ఈ సినిమాను ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నుంచి కూడా తొలగించారు.

Advertisement

ఇప్పుడు ఈ లేడీ స్టార్ ఆమె భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న ‘LIC’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, SJ సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నయనతార కీలకమైన పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఆమె కృతి శెట్టి అక్క పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

Read More: నన్ను క్షమించండి.. ‘అన్నపూరణి’ వివాదంపై నయనతార పోస్ట్‌..

Advertisement

ఇటీవల ఈ మూవీ టైటిల్‌పై ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ’(LIC) అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీకి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇక అది మరువక ముందే.. నయనతార ఈ మూవీ యూనిట్‌కి గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ మూవీ నుంచి ఆమె తప్పుకోవాలి అని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో చిత్ర బృందానికి మరొక పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఇప్పటికే స్టార్ హీరోలతో జత కట్టిన నయనతార.. సౌత్‌లోని భారీ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న నటీమణిగా ఉంది.

ఈ క్రమంలోనే ఈ ఎల్‌ఐసీ మూవీ కోసం ఆమె భారీగానే రెమ్యునరేషన్ ఆశించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీ నిర్మాణంలో ఆమె భర్త విఘ్నేష్ శివన్ భాగమైనప్పటికీ.. రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ఏ మాత్రం తగ్గినట్లు అనిపించడంలేదని తెలుస్తోంది.

Read More: నయన్‌ భర్తకు తప్పని చిక్కులు.. ఎల్‌ఐసీ నోటీసులు

అందువల్లనే పారితోషికం కారణంగానే ఆమె ఈ మూవీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ మూవీ నుంచి నయనతార తప్పుకుంటే ఆ ప్లేస్‌లో మేకర్స్ ఎవరిని తీసుకువస్తారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×