BigTV English

Rajasthan: పండుగపూట రాజస్థాన్‌లో విషాదం, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం

Rajasthan: పండుగపూట రాజస్థాన్‌లో విషాదం, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం
rajasthan fire accident injured 14 childrens1
 

Mahashivaratri Festival, The Condition of Two Children is Critical : భారత్‌లోని అన్ని శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల భక్తి పారవశ్యంతో శివనామస్మరణతో ఆలయాలన్ని మారుమోగుతున్నాయి. ఉదయం నుండే ఆలయాలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇదిలా ఉంటే.. రాజ‌స్థాన్‌లోని కోటాలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. మ‌హా శివ‌రాత్రి వేడుక‌ల్లో అప‌శృతి చోటు చేసుకుంది.


ప్రమాదవశాత్తు క‌రెంట్ షాక్‌ తగలడంతో 14 మంది చిన్నారుల‌కు గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన చిన్నారుల‌ను చికిత్స కోసం వెంట‌నే స‌మీప ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే, చికిత్స పొందుతున్న 14 మందిలో ఇద్దరు చిన్నారుల ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు రాజస్థాన్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్ న‌గ‌ర్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read More:ఇండియా టూ రష్యన్ ఆర్మీ..! మానవ అక్రమ రవాణా గుట్టురట్టు చేసిన సీబీఐ..


అనంతరం ఈ దుర్ఘట‌న‌పై మంత్రి హీరాలాల్ మీడియాతో మాట్లాడారు. ఇది చాలా బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న అని ఆయన అన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయ‌ప‌డ‌డం తీవ్రంగా క‌లిచి వేసింద‌ని తెలిపారు. ఓ చిన్నారికైతే 100 శాతం కాలిన గాయాలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. మిగిలిన వారికి 50 శాతం కంటే త‌క్కువ కాలిన గాయాలు అయిన‌ట్లు చెప్పారు.

ప్రత్యేక వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. క‌రెంట్ షాక్‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు హైటెన్షన్ ఓవ‌ర్ హెడ్ విద్యుత్ లైన్ కార‌ణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ ఘటనా సహజంగానే జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేశారా..? అనే కోణంలో రాజస్థాన్ పోలీసులు ఫోకస్ పెట్టారు.

Read More: అమెరికన్ యూట్యూబర్‌కు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రియేటర్ అవార్డు..

ఇదిలా ఉంటే.. గాయపడిన పిల్లల తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు ఎవరైనా భాధ్యులని తేలితే.. వారు ఎవరైనా సరే.. దీనికి కారకులైన వారిని వదిలిపెట్టొద్దని నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. దీంతో అటు పోలీస్ అధికారులు పిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. ఇక మరోపక్క తీవ్రంగా గాయపడిన పిల్లల రోదనలతో ఆస్పత్రి ఆవరణలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×