E-Paper
Advertisement

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్
Advertisement

Chamba: దేవుడు కనిపిస్తే చూడాలని చాలామంది కోరుకుంటారు. మనిషి రూపంలో దేవుడు ఉంటాడని ఆస్సలు ఊహించరు. కానీ యువ బైకర్‌కు కొత్తగా పెళ్లైన జంట దేవుళ్లు అయ్యారు. వరద ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయే పరిస్థితిలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు. నూతన వధూవరులు కలిసి ప్రాణాలకు తెగించి యువకుడ్ని సురక్షితంగా ఒడ్డుకు లాగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

 

హిమాచల్‌లోని చంబా ప్రాంతంలో అకస్మిక వరద

Advertisement

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా ప్రాంతంలో అకస్మాత్తుగా వరద సంభవించింది. ఆ వరద ప్రవాహంలో చిక్కుకున్నాడు యువ బైకర్. బలమైన ప్రవాహం అతడ్ని లాక్కుపోతోంది. అదే రూట్లో కొత్తగా పెళ్లైన ఓ జంట వస్తోంది. ఆ సన్నివేశాన్ని చూసి వెంటనే వాహనాన్ని ఆపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వరుడు కిందకు దిగి సదరు యువకుడ్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. భటియత్ జిల్లాలోని భర్మాలా ప్రాంతంలో కకియారా-తునుహట్టి రహదారిపై ఈ సంఘటన జరిగింది.

 

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్

Advertisement

సోమవారం సాయంత్రం ఆలస్యంగా కురిసిన భారీ వర్షం కారణంగా రహదారిపై నీరు వేగంగా ప్రవహిస్తోంది. ప్రవాహం క్షణక్షణానికి బలంగా మారుతోంది. ఆ సమయంలో ఘటాష్నిలోని మామ్లా గ్రామానికి చెందిన ఓ బైకర్ ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్నాడు. వరద అతడ్ని లాక్కుపోతోంది. కొన్ని సెకన్లు ఆలస్యమై ఘోర విషాదం జరిగేది. అదే సమయంలో ఆ రూట్లో వివాహం చేసుకున్న యువ జంట వాహనంలో వస్తోంది. ఆ సన్నివేశాన్ని చూసి వాహనాన్ని ఆపారు. ఈలోగా వరుడు వాహనం నుంచి కిందకు దిగాడు.

దేవదూతల్లా ప్రత్యక్షమైన కొత్త జంట, యువకుడ్ని కాపాడారు

కొత్తగా పెళ్లైన వధువు సహా మరో ఇద్దరు మహిళలు, వాహనంలోని దుప్పటిని తాత్కాలిక తాడుగా ఉపయోగించి చిక్కుకుపోయిన బైకర్‌‌‌కి వరుడు సాయంతో దుప్పటి అందించారు. నీటి ప్రవాహం నుంచి కొట్టుకుపోకుండా అతడ్ని కాపాడారు. కొన్ని క్షణాల తర్వాత బైకర్ ఆ వస్త్రాన్ని పట్టుకుని బయటపడ్డాడు. ప్రమాదకరమైన ప్రాంతం నుండి అతడ్ని బయటకు తీసుకురావడానికి వాహనంలోని మహిళలకు సహాయం చేశాడు.

ALSO READ: నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బలమైన వరద ప్రవాహంలో ఇలాంటి రెస్క్యూ చాలా ప్రమాదకరమని అంటున్నారు. ప్రాణం పోయే ఆఖరిక్షణంలో దేవ దూతల్లా కొత్తగా పెళ్లైన జంట ప్రత్యక్షమై యువకుడ్ని కాపాడారని అంటున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన కొత్త జంటకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

 

Related News

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

Big Stories

Advertisement
×