E-Paper
Advertisement

Voter EPIC Card: 15 రోజుల్లో ఓటర్ ఐడీ కార్డు హోండెలివరీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Voter EPIC Card: 15 రోజుల్లో ఓటర్ ఐడీ కార్డు హోండెలివరీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Advertisement

Voter EPIC Card: కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ఓటరు ఐడీ కార్డులపై కీలక ప్రకటన చేసింది. 15 రోజుల్లోగా ఓటర్ కార్డును డెలివరీ చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. కొత్త దరఖాస్తులు, ఓటర్ ఐడీలో అప్డేట్స్ చేసుకున్నా తర్వాతా సులభంగా ట్రాక్ చేయవచ్చని, నేరుగా ఇంటి వద్దకే కార్డు డెలివరీ అవుతుందని పేర్కొంది. ECINET ద్వారా ఒకే ప్లాట్‌ఫామ్‌లో 40+ యాప్‌లు/వెబ్‌సైట్‌లను చెక్ చేయవచ్చని తెలిపింది. ఓటర్ ఐడీ సేవల కోసం https://ecinet.eci.gov.in వెబ్ సైట్ ను వీక్షించవచ్చని తెలిపింది.

గతంలో ఎలక్టర్‌ ఫొటో ఐడెంటిటీ కార్డ్‌ (EPIC) పొందేందుకు నెలల సమయం పట్టేది. ఇకపై కొత్త ఓటర్లకు, ఇప్పటికే ఓటరుగా నమోదై వివరాల్లో మార్పుచేర్పులు చేసుకున్న వారికి కొత్త ఓటరు కార్డులు 15 రోజుల్లోగా డెలివరీ చేయనున్నారు. ఇందుకోసం నూతన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల నమోదు అధికారి ఎపిక్‌ జనరేట్‌ చేసినప్పటి నుంచి ఓటరుకు పోస్ట్ లో డెలివరీ అయ్యే వరకు ప్రతి దశలో ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తామని ఈసీ తెలిపింది. ఓటర్‌ ఐడీలను సులభంగా డెలివరీ చేసేందుకు ఎన్నికల సంఘం ECINet ప్లాట్‌ఫామ్‌ సైతం ప్రారంభించింది. ఇది పోస్టల్‌ విభాగం ఏపీఐతో అనుసంధానమై పనిచేస్తుంది.

ఓటర్ ఐడీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు

  • కొత్త ఓటర్లు/ఓటర్ ఐడీ మార్పులు కోసం ఎన్‌వీఎస్పీ వెబ్‌సైట్‌లో ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీతో రిజస్టర్ చేసుకోవాలి.
  • అకౌంట్ క్రియేట్ చేసి పేరు, పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి.
  • ఈ-మెయిల్‌ ఐడీకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నింపి వివరాలను ధ్రువీకరించాలి.
  • అనంతరం మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా నమోదు చేసి ఓటీపీతో లాగిన్‌ అవ్వండి.
  • కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదు చేయాలి. అందులో అడిగిన డాక్యుమెంట్‌లు అప్లోడ్‌ చేయాలి.
  • మార్పు చేర్పులు కోసం ఫారం-8 ను నింపాలి. వివరాలు పూర్తి చేసిన తర్వాత Acknowledgement Number వస్తుంది. దీంతో అప్లికేషన్ ట్రాక్ చేవచ్చు.
Advertisement

Also Read: SBI mCash: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఇలా డబ్బు పంపలేరు

అప్లికేషన్‌ స్టేటస్‌ చెక్ చేయడం ఎలా?

  • ఈసీ ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌లో మొబైల్‌ నంబర్, పాస్‌వర్డ్‌, క్యాప్చా నమోదు చేసి ఓటీపీతో ఖాతాలో లాగిన్‌ అవ్వండి.
  • ట్రాక్‌ అప్లికేషన్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి దరఖాస్తు సమయంలో వచ్చిన నెంబర్ ఎంటర్‌ చేయండి.
  • రాష్ట్రం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే అప్లికేషన్‌ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Related News

రేషన్‌కార్డులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల సరుకులు, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×