E-Paper
Advertisement

Ramoji Awards: రామోజీరావు చెప్పిన ఆ మాటలు మర్చిపోలేను.. ‘రామోజీ అవార్డ్స్’లో CM రేవంత్ రెడ్డి

Ramoji Awards: రామోజీరావు చెప్పిన ఆ మాటలు మర్చిపోలేను..  ‘రామోజీ అవార్డ్స్’లో CM రేవంత్ రెడ్డి
Advertisement

Ramoji Awards: రామోజీరావు నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ.. హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక “నాలుగో అద్భుతం” (Fourth Wonder) అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీల తర్వాత, రామోజీ ఫిలిం సిటీ ఆ స్థాయి గుర్తింపును తెచ్చిందన్నారు. “రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రామోజీరావు విలువలను, స్ఫూర్తిని కొనసాగిస్తూ, వివిధ రంగాల్లో రాణించిన వారిని గుర్తించి అవార్డులు ఇస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా కిరణ్ ని రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందించారు.

తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డుల స్థాయి నుంచి ఆస్కార్ అవార్డుల స్థాయికి ఎదిగిందంటే, దానికి రామోజీ ఫిలిం సిటీ అందించిన తోడ్పాటు ఎంతో ఉందని సీఎం ప్రశంసించారు. “స్క్రిప్ట్‌తో వస్తే ప్రింట్‌తో వెళ్లాలి” అన్న రామోజీ కల ఈరోజు నిజమైందని, ఒక సినిమాకు కావాల్సిన అన్ని నైపుణ్యాలను 2000 ఎకరాల ఈ కళాఖండంలో కేంద్రీకృతం చేశారని అన్నారు. అనేక సమస్యలను తట్టుకుని నిలబడి, తెలంగాణకు గర్వకారణంగా ఫిలిం సిటీని తీర్చిదిద్దారని కొనియాడారు.

Advertisement

పత్రికా రంగంలో “ఈనాడు” 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై మాట్లాడుతూ.. “పొద్దున లేవగానే ఈనాడు పేపర్ చదవడం, రాత్రి పడుకునే ముందు ఈటీవీ వార్తలు చూడటం తెలుగు ప్రజలకు అలవాటుగా మార్చారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ అలవాటు వ్యసనంగా మారింది,” అని చమత్కరించారు. ఎన్ని పత్రికలు వచ్చినా, నికార్సైన సమాచారం కోసం తాను రోజూ ఈనాడు పేపర్ తప్పక తిరగేస్తానని, ఇందులో మసాలాలు కాకుండా వాస్తవాలు ఉంటాయని అన్నారు.

ఒకే వ్యక్తి.. ఇన్ని రంగాల్లో నంబర్ వన్

ప్రియా పచ్చళ్లు, మార్గదర్శి చిట్‌ఫండ్, ఈనాడు, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ.. ఇలా ఒకదానికొకటి పొంతన లేని వివిధ రంగాలలో ప్రవేశించి, ప్రతి రంగంలోనూ నంబర్ వన్‌గా నిలవడం రామోజీరావు గారి అసామాన్య ప్రతిభకు నిదర్శనమని రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఒక వ్యక్తి ఒక విషయంలో టాలెంట్ చూపిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ రామోజీ గారు రోజుకు 18 గంటలు శ్రమించి, అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే రామోజీ అనేది ఒక పేరు కాదు, అదొక బ్రాండ్,” అని వ్యాఖ్యానించారు.

“మంత్రి పదవి అడగలేదు.. ఆయనే చెప్పారు”

Advertisement

రామోజీరావుతో తనకున్న ఒక ముఖ్యమైన అనుభవాన్ని సీఎం పంచుకున్నారు. “2009లో ఎన్నికలయ్యాక, ఓట్ల లెక్కింపునకు నెల రోజులు సమయం ఉంది. ప్రభుత్వం వస్తుందన్న నమ్మకంతో, మంత్రి పదవుల ఆశతో నలుగురు మిత్రులం కలిసి రామోజీ అపాయింట్‌మెంట్ తీసుకున్నాం,” అని గుర్తుచేసుకున్నారు.

“బయట చాలామంది, రామోజీ చిట్టీ పంపిస్తేనే చంద్రబాబు మంత్రులను పెడతారని అనుకునేవారు. మా నడక, చూపులు చూసి ఆయనకు మా ఉద్దేశం అర్థమైంది. భోజనం పెట్టి కూర్చోబెట్టి, ఆయనే అన్నారు.. ‘నేను ఇప్పటివరకు ఎవరికీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు. నా దగ్గరకు వచ్చేవారికి ఎమ్మెల్యేలుగానే బాగా రాణించమని చెప్తాను. మీరు కష్టపడి పనిచేయండి. మంచి చేస్తే నా పత్రికలో స్థానం ఉంటుంది, చెడు చేస్తే మొదటి పేజీలోనే స్థానం ఉంటుంది. ఏది కావాలో మీరే కోరుకోండి’ అని చెప్పారు,” అంటూ రామోజీ నిబద్ధతను, రాజకీయాలకు అతీతమైన ఆయన వైఖరిని రేవంత్ రెడ్డి వివరించారు.

రామోజీరావు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్క పని కూడా అడగలేదని, నిరంతరం పేపర్‌లోని స్పెల్లింగ్ తప్పులను కూడా సరిచేస్తూ నిబద్ధతతో పనిచేసేవారని సీఎం గుర్తుచేసుకున్నారు. రామోజీ సంస్థలు తెలంగాణకు, హైదరాబాద్‌కు గొప్ప గౌరవం అని, ఈ బ్రాండ్‌ను కొనసాగించే క్రమంలో తమ ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. “మేము మీకు అన్యాయం చేయకపోవడమే మీకు ఇచ్చే పెద్ద సహకారం,” అని వ్యాఖ్యానించారు. అలాగే, పెద్దలు వెంకయ్య నాయుడు, ఎన్వీ రమణ గారి సూచన మేరకు ప్రభుత్వ జీవోలలో తెలుగు భాషను తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Read Also: Ramoji Awards: రామోజీరావు 40 ఏళ్లలో ఒక్క ఫేవర్ అడగలేదు.. రామోజీ అవార్డ్స్ 2025లోచంద్ర‌బాబు ప్రసంగం

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×