E-Paper
Advertisement

OTT Movie : ప్రేమించకపోతే చంపేస్తుంది… ఆమె కంట్లో పడ్డ మగాడికి దబిడి దిబిడే

OTT Movie : ప్రేమించకపోతే చంపేస్తుంది… ఆమె కంట్లో పడ్డ మగాడికి దబిడి దిబిడే
Advertisement

OTT Movie : డిజిటల్ స్ట్రీమింగ్ లో ఎన్నో సైకో కిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్కోటి ఒక్కో స్టైల్ లో ఉంటుంది. కిల్లర్ ఎదో ఒక కారణం చేత హత్యలు చేస్తుంటాడు. ఈ సినిమాలలో కిల్లర్స్ ఎక్కువగా మగవాళ్లే ఉంటారు. అయితే ఒక అడ సైకోతో వచ్చిన హాలీవుడ్ మూవీలో దారుణమైన హింస ఉంటుంది. మగ సైకోలను ఆ అమ్మాయి మించిపోతుంది. ఆమె తన ప్రేమను ఎవరైనా ఒప్పుకోకపోతే వాళ్ళను హింసిస్తూ చంపుతుంది. అంతే కాకుండా జాంబిలుగా కూడా మారుస్తుంది. సైకో ఫ్యాన్స్ కి ఇది మస్ట్ వాచ్ మూవీ. ఈ సినిమా 2009 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో “పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ ని కూడా గెలుచుకుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘ది లవ్డ్ ఒన్స్’ (The Loved Ones) 2009లో విడుదలైన ఆస్ట్రేలియన్ హారర్ కామెడీ సినిమా. ఇది షాన్ బైర్న్ దర్శకత్వంలో తెరకెక్కింది. : ఇందులో జేవియర్ సామ్యూల్, రాబిన్ మెక్‌లీవీ, జాన్ బ్రంప్టన్ లీడ్ రోల్స్ లో నటించారు. 84 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.6/10 రేటింగ్ ని పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బ్రెంట్ అనే యువకుడు తన తండ్రితో కలసి కారు నడుపుతుండగా, రోడ్డు పక్కన రక్తంతో ఒక వ్యక్తి కనిపిస్తుంది. బ్రెంట్ భయపడి స్టీరింగ్ పక్కకు తిప్పడంతో కారు చెట్టుకు ఢీ కొడుతుంది. దీంతో అతని తండ్రి అక్కడికక్కడే చనిపోతాడు. బ్రెంట్ మాత్రం బతికిపోతాడు. అప్పట్నుంచి బ్రెంట్ చాలా డిప్రెషన్‌లో ఉంటాడు. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత కూడా చేతులను కత్తితో కోసుకుంటూ బాధపడుతుంటాడు. అతని ప్రేయసి హాలీ, స్నేహితుడు జామీ ఈ సమయంలో అతనికి తోడుగా ఉంటారు. ఒక రోజు స్కూల్‌లో డాన్స్ పార్టీ సమయంలో లోలా అనే అమ్మాయి బ్రెంట్‌ను ఆహ్వానిస్తుంది. ఆమెకు అతని మీద క్రష్ ఉంటుంది. కానీ అతను ‘నేను నా ప్రేయసితో వెళ్తాను’ అని చెప్పి వెళ్ళి పోతాడు. దీంతో లోలా కోపంతో రగిలిపోతుంది. ఆ తరువాత ఆమెలోని సైకో యాంగిల్ బయట పడుతుంది.

Read Also :ముసలి వాళ్లనే టార్గెట్ చేసి చంపే సైకో… ట్విస్టులతో మైండ్ బ్లాకయ్యే మిస్టరీ థ్రిల్లర్

Advertisement

తన తండ్రి సాయంతో బ్రెంట్‌ను ఇంటికి ఎత్తుకెళ్లి టేబుల్‌కు కట్టేసి భయంకరంగా టార్చర్ చేస్తుంది. అతని కాళ్ళల్లో డ్రిల్ చేసి హానికరమైన లిక్విడ్స్ పోస్తుంది. అంతటితో ఆగకుండా తన పేరు మొదటి అక్షరం “L” ను ఛాతీ మీద కత్తితో చెక్కుతుంది. అతని మెదడులో రంధ్రం కూడా పెడుతుంది. ఇప్పుడు అక్కడ మరో ట్విస్ట్ వస్తుంది. ఆ ఇంటి సెల్లార్ లో ఇలా టార్చర్ చేసిన అబ్బాయిలను జాంబీల్లా మార్చి ఉంచుతుంటుంది. ఇక క్లైమాక్స్ మరిన్ని ట్విస్టులతో మతి పోగొడుతుంది. ఆ ట్విస్టులు ఏమిటి ? చివరికి బ్రెంట్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడా ? జాంబీగా మారిపోతాడా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ ఆస్ట్రేలియన్ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×