Expired Food: ఆన్ లైన్లో ఫుడ్ ఆడర్ పెట్టుకుని దర్జాగా తినేవారికి ఓ షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఎఫ్ డీఏ అధికారులు జరిపిన ఏకదాటి దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. థానే, పూణే, మహారాష్ట్రాల్లో రూ. 48 లక్షల విలువ చేసే గడువు ముగిసిన, పాడైపోయిన ఆహర ఉత్పత్తులను ఎఫ్డీఎ అధికారులు రైడ్స్ చేసి పట్టుకున్నారు. దీంతో రిలయన్స్, బ్లింకిట్, జొమాటోతో పాటు మరో 10 మందిపై అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే థానే, పుణె జిల్లాల పరిదిలో ఉన్న వేర్హౌస్లు, అవుట్లెట్లు, ప్రాసెసింగ్ యూనిట్లపై ఎఫ్డీఏ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మొత్తం గడువు అయిపోయిన, లీక్ అయి దెబ్బతిన్న భారీ ఆహర పదార్థాలను ఎఫ్డీఏ అధికారుల స్వాదీనం చేసుకున్నారు. దీంతో అధికారుల సీజ్ చేసిన వాటి విలువ దాదాపుగా రూ.48.09 లక్షలవరకు ఉంటుదని అధికారులు తెలిపారు.
అయితే ప్రభుత్వ నిభందనల ప్రకారం డ్యామేజ్ అయిన లేదా గుడువు ముగిసిన పదార్థాలను వేర్హౌస్ల నుంచి రీసైక్లింగ్ చేయాలి.. లేదంటే పూర్తిగా వీటిని ద్వంసం చేయాల్సిఉంటుంది. కానీ వీల్లు గడువు ముగిసిన సరుకులను మళ్లీ మార్కెట్లోకి రీ-సప్లై చేస్తున్నట్టు అధికారులు విచారణలో గుర్తించారు. దీంతో ఆ దందాను పసిగట్టిన అధికారులు అక్కడున్న 10 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో రిలయన్స్, బ్లింకిట్, జొమాటో, కంపెనీలకు చెందిన వారితో పాటు రీ సైక్లింగ్ చేస్తున్న కొంతమంది వ్యక్తులపై అధికారులు కేసు నమోదు చేశారు.
Also read: మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!