Bathukamma: నేడు హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్ లైన్స్ ప్రాంగణంలో 72 అడుగుల భారీ బతుకమ్మతో సద్ధుల బతుకమ్మ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి. దీంతో మహిళలందరూ కలిసి బతుకమ్మ ఆడుతూ చిందులేసారు. ఓ పక్క ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించబడ్డ పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు అందరూ కలిసి మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గోని బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. దీనిలో భాగంగా బిగ్ టీవితో ఓ చిన్నారి బతుకు పాట పాడి అందరి మనసు గెలుచుకుంది.