E-Paper
Advertisement

Big relief to Ravi Kishan: రేసుగుర్రం విలన్‌ రవికి రిలీఫ్, డీఎన్ఏ టెస్టుకు కోర్టు నో

Big relief to Ravi Kishan: రేసుగుర్రం విలన్‌ రవికి రిలీఫ్, డీఎన్ఏ టెస్టుకు కోర్టు నో
Advertisement

Big relief to Ravi Kishan: సౌతిండియా ఫేమస్ నటుడు, సిట్టింగ్ ఎంపీ, గోరఖ్‌పూర్ బీజేపీ అభ్యర్థి రవికిషన్‌కు బిగ్ రిలీఫ్. ఆయనకు డీఎన్ఏ టెస్టుకు అవసరం లేదని ముంబై హైకోర్టు క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ అసలేం జరిగింది? ఆయనకు డీఎన్ఏ టెస్టు ఏంటి? అసలు స్టోరీలోకి వెళ్తే..

ఎన్నికల సమయంలో నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌కు రిలీఫ్ లభించింది. రవికిషన్ తన తండ్రి అంటూ జూనియర్ నటి షినోవా సోనీ తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆపై ముంబై కోర్టును ఆశ్రయించింది. ఆమె అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. రవికిషన్ – అపర్ణల మధ్య రిలేషన్ ఉన్నట్లు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవన్న న్యాయస్థానం, రవికి డీఎన్ఏ పరీక్ష అవసరంలేదని తోసిపుచ్చింది. ఇంతకీ అపర్ణ ఎవరు? ఇంకా లోతుల్లోకి ఒక్కసారి వెళ్దాం.

Advertisement

హిందీ, భోజ్‌పురి సినిమాలతో వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రవికిషన్. టాలీవుడ్‌లో రేసుగుర్రం సినిమాతో సౌత్‌లో ఫేమస్ అయ్యాడు. 2019లో యూపీ సీఎం యోగి సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈసారి ఎన్నికల్లో కమలం పార్టీ తరపున అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు.

అదే సమయంలో రవికిషన్ తన భర్త అంటూ అపర్ణాసోనీ కొద్దిరోజుల కిందట మీడియా ముందుకొచ్చింది. ఈ వ్యవహారంలో ఆయనపై రచ్చ చేసింది. ఈ విషయం బయటకురాగానే ఆమె కూతురు షినోవా సోనీ.. రవికిషన్ తన తండ్రి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు చివరకు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది.  రవికిషన్‌కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని తన లాయర్ ద్వారా పిటీషన్ దాఖలు చేసింది.

Advertisement

ఈ కేసుపై శుక్రవారం ముంబై న్యాయస్థానంలో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. అపర్ణ-రవికిషన్ ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతేకాని ఎలాంటి రిలేషన్ లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. అంతకుమించి ఒక్క ఆధారం కూడా అపర్ణ, షినోవాలు చూపలేకపోయారు. దీంతో రవికిషన్ లాయర్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. చివరకు రవికి డీఎన్ఏ పరీక్షను కోర్టు తిరస్కరించింది.

ALSO READ:  నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేజ్రీవాల్ సతీమణి

గతంలో 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని రవికిషన్‌ను అపర్ణ, షినోవాలు బెదిరించారని ఆయన భార్య తెలిపింది. తాము అడిగిన సొమ్ము ఇవ్వకుంటే అత్యాచారం కేసులో రవికిషన్‌‌ను ఇరికిస్తామని బెదిరించిన విషయం తెల్సిందే. మొత్తానికి రేసుగుర్రం ఫేం రవికిషన్‌కు ఎన్నికల వేళ ఈ విషయంలో బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు.

Tags

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×