Big Stories

Sunita Kejriwal to lead AAP Campaign: నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేజ్రీవాల్ సతీమణి

Sunita Kejriwal to lead AAP Campaign in Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతిషి తెలిపారు. శుక్రవారం అతిషి మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్.. ఢిల్లీలో ఈరోజు జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆప్ తరఫున ఆమె పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా నిర్వహించే ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలలో ఆమె పాల్గొని ఆప్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా ప్రజలను కోరనున్నారని అతిషి తెలిపారు. ఇవాళ తూర్పు ఢిల్లీలో రోడ్ షో నిర్వహించి ఆప్ అభ్యర్థికి ఓటు వేయాలని కేజ్రీవాల్ తరఫున ఆమె ప్రజలను కోరనున్నారని అతిషి తెలిపారు.

- Advertisement -

లోక్ సభ ఎన్నికల ప్రచారం నుంచి అడ్డుకునేందుకు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని అతిషి ఆరోపించారు. ఢిల్లీ అయినా, పంజాబ్ అయినా, దేశంలోని ఇతర ప్రాంతాలైనా సరే.. కేజ్రీవాల్ అరెస్ట్ పై నిరసన తెలుపుతున్నారని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ పై తమ ఓట్లతో సమాధానం చెబుతామని ప్రజలు ఏకగ్రీవంగా చెబుతున్నారని అతిషి అన్నారు.

- Advertisement -

అయితే, ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఆప్.. తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. గుజరాత్ లోని భరూచ్, భావ్ నగర్ అనే రెండు స్థానాల నుండి పోటీలోకి దింపింది. అదేవిధంగా హర్యానాలో కూడా పోటీ చేస్తోంది. ఇటు పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా మొత్తం 13 స్థానాల్లో పోటీ చేస్తోంది.

Also Read: నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏమవుతుంది.? ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు

భారత కూటమి అధికారంలోకి వస్తే దేశంలో ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి వస్తోందని ఆమె అన్నారు. అయితే, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News