E-Paper
Advertisement

Anupama Parameswaran : అనుపమ కొత్త సినిమా ‘పరదా’ కాన్సెప్ట్ వీడియో రిలీజ్.. థాంక్యూ సమంత

Anupama Parameswaran : అనుపమ కొత్త సినిమా ‘పరదా’ కాన్సెప్ట్ వీడియో రిలీజ్.. థాంక్యూ సమంత
Advertisement

Anupama Parameswaran – Paradha :యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే ‘టిల్లు స్క్వేర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో రొమాంటిక్ సీన్లలో నటించి అదరగొట్టేసింది. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని పాత్రలో బోల్డ్ సీన్లతో రెచ్చిపోయింది. దీంతో యూత్ అంతా థియేటర్లకు పరుగులు తీశారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.125 కోట్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసి అబ్బురపరచింది.

అయితే అనుబ్యూటీ ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు లేడీ ఓరియేంటెడ్ మూవీ చేస్తుంది. ‘సినిమా బండి’ ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, మలయాళీ నటి దర్శన రాజేంద్రన్, మరో సీనియర్ నటి సంగీత ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

ఈ మూవీకి తాజాగా మేకర్స్ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి గానూ ‘పరదా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ గ్లింప్స్‌లో మొదటిగా అమ్మవారి కళ్లకు గంతలు కట్టినట్లు చూపించారు. ఆ తర్వాత అనుపమతో సహా చుట్టు ఉండేవాళ్లందరూ మొఖంపై చీర కొంగును కప్పుకుని ఉన్నారు. ఈ గ్లింప్స్‌ ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.

అంతేకాకుండా టైటిల్‌తోనే ఈ మూవీ ఏదో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నట్లు అనిపిస్తుంది. ఈ మూవీతో దర్శకుడు ప్రవీణ్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హిమాలయాల్లో జరుగుతుంది. కాగా ఈ మూవీ ఇద్దరు హీరోయిన్లతో ప్రేమ పేరుతో అమ్మాయిలకు ఆంక్షలు.. అలాగే ట్రావెలింగ్ నేపథ్యంలో సాగనుందని సమాచారం.

Advertisement

Also Read: మరొక కొత్త సినిమాతో అనుబ్యూటీ.. కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయనున్న సామ్

సమంత, రాజ్ అండ్ డీకే రిలీజ్ చేసిన ఈ అప్డేట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఇక ఈ మూవీ పోస్టర్‌ను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టి మూవీ టీంను ప్రశంసించింది. అంతేకాకుండా ఈ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలిపింది. దీనిపై అను బ్యూటీ తన స్టోరీలో రిప్లై ఇచ్చింది. థ్యాంక్యూ సమంత గారు అంటూ తెలిపింది.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×