E-Paper
Advertisement

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం, 47 కిలోమీటర్లు రోడ్డుపై తిప్పుతూ

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం, 47 కిలోమీటర్లు రోడ్డుపై తిప్పుతూ
Advertisement

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు, వారిని తమ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. 47 కిలోమీటర్లు రోడ్డుపై తిప్పుతూ అఘాయిత్యం పాల్పడ్డారు బస్సు డ్రైవర్-కండక్టర్. చివరకు వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆగష్టు నాలుగున జరిగింది. అసలు ఏం జరిగింది?

 

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం

Advertisement

ఢిల్లీలో ఓ స్లీపర్ బస్సులో 16 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బస్సు కిటికీలకు కర్టెన్లు వేసి బస్సును 47 కిలోమీటర్లు రోడ్డుపై నడిపారు. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు పరిచౌక్ వద్ద బస్సు ఎక్కింది. నిందితుడు ఆమెని కాశ్మీరీ గేట్ వద్ద దించేశారు. రోడ్డుపై బస్సు సుమారు 47 కిలోమీటర్లు ప్రయాణించింది. బస్సు కిటికీలకు కర్టెన్లు కప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. బాధితురాలు యూపీలోని మైన్‌పురి జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని.

స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం,

ఘటన ఎలా జరిగింది? బాధిత యువతి ఇంట్లో గొడవపడిన తర్వాత తన కుటుంబసభ్యులకు చెప్పకుండా రాత్రి వేళ ఇంటి నుండి బయలుదేరింది. నోయిడాలో ఉంటున్న తన కజిన్‌ను కలవడానికి బయటకు వచ్చింది. ఆ రోజు భారీ వర్షం, మరొవైపు చీకటి కారణంగా పొరపాటున పరి చౌక్ వద్ద దిగింది యువతి. సరిగ్గా అదే సమయంలో ఓ ఖాళీ స్లీపర్ బస్సు అటువైపు వస్తోంది. వర్షంలో చిక్కుకుపోయిన ఆ విద్యార్థిని, తనకు సహాయం చేయాలని కోరింది. బస్సు ఆపాలని చేతులు ఊపడంతో డ్రైవర్-కండక్టర్ ఎక్కించారు. నోయిడాలోని సెక్టార్ 63 కి వెళుతుందని చెప్పారు. బస్సు బయలుదేరిన కొద్దిసేపటికే కండక్టర్ ఆ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

Advertisement

 

కిటికీలకు కర్టెన్లు కప్పి, 47 కిలోమీటర్లు రోడ్డుపై తిప్పుతూ

తొలుత డ్రైవర్, ఆ తర్వాత కండక్టర్ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు వివరించింది. ఆ సమయంలో ప్రతిఘటించడంతో చంపేస్తామని బెదిరించారని తెలిపింది. వారిద్దరు అర్ధరాత్రి దాటిన తర్వాత కాశ్మీరీ గేట్ బస్ టెర్మినల్ సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద విద్యార్థిని దించేశారు. అక్కడి నుంచి బస్సులో వారు వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత భయపడిన విద్యార్థిని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాశ్మీరీ గేట్ పోలీసులను సంప్రదించి జరిగిన ఘటనను వివరించింది.

ALSO READ: ఇస్రోలో ఫ్రెషర్స్‌కు మంచి ఛాన్స్.. సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల ఖాళీలు.. పూర్తి వివరాలివిగో

తిమర్‌పూర్‌లోని బస్ పార్కింగ్ స్థలంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఘటనకు ఉపయోగించిన స్లీపర్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన రోజు బస్సులో సాంకేతిక లోపం తలెత్తిందని, నిందితులు దానిని మరమ్మతు కోసం సూరజ్‌పూర్‌లోని ఓ వర్క్‌షాప్‌కు తీసుకువెళ్లినట్టు యజమాని తెలిపాడు. మరమ్మతులు పూర్తయ్యాక డ్రైవర్-కండక్టర్ ఖాళీ బస్సులో తిమార్‌పూర్‌కు వెళ్తుండగా పరిచౌక్ వద్ద ఆ విద్యార్థిని బస్సు ఎక్కించినట్టు తెలిపారు.

Related News

ఇస్రోలో ఫ్రెషర్స్‌కు మంచి ఛాన్స్.. సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల ఖాళీలు.. పూర్తి వివరాలివిగో

ఇంగువలో నాణ్యతా లోపాలు.. ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ ఉత్పత్తులపై FSSAI నిషేధం!

నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గోపిశెట్టి గల్లంతు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు, కంపెనీ ప్రకటన

డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్!

బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. మమతా బెనర్జీపై కేసు నమోదు

ఇండియాలో తగ్గిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఇతర రంగాల్లోనూ ఏఐ తప్పనిసరి

చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన ఎక్స్‌పైరీ స్నాక్స్.. కట్ చేస్తే అధికారి నోట్లోనే పెట్టిన స్థానికులు!

Big Stories

Advertisement
×