Rashmika mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna) జూలై ఆఖరి నెలలో ‘మైసా’ సినిమా షూటింగ్లో భాగంగా కాలి తుంటి భాగంలో గాయం కాగా, విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంటికే పరిమితమైన ఈమె ఇటీవల ఒక పెళ్లి వేడుకలో తన భర్తతో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడిందని , త్వరలోనే షూటింగ్ సెట్లో పాల్గొనబోతోంది అంటూ వార్తలు రాగా.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అధికారికంగా ప్రకటించింది కూడా.
ఇన్ని రోజులు ఇంట్లో కూర్చున్న రష్మిక మందన్న.. తన కుటుంబ సభ్యులతో కలసి స్పెండ్ చేసిన సమయానికి సంబంధించిన కొన్ని విషయాలను ఫోటోలు రూపంలో షేర్ చేసింది. ముఖ్యంగా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫోటోలను, తన గార్డెన్ లో తీసుకున్న ఫోటోలను, అలాగే నెమలి పింఛం విప్పుతున్న ఫోటోలను షేర్ చేస్తూ అసలు విషయాన్ని అధికారికంగా ప్రకటించింది రష్మిక మందన్న. అలాగే తన చెల్లెలు షిమాన్ మందన్న (Shiman mandanna) ను ఆప్యాయంగా హగ్ చేసుకున్న ఫోటోని కూడా షేర్ చేసింది .అంతేకాదు పలు ఫజిల్ ఆటలు ఆడినట్టుగా కూడా ఆ ఫోటోలను షేర్ చేసింది రష్మిక మందన్న.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఇలా పోస్ట్ చేసింది.” నేను త్వరలో తిరిగి పనిలోకి వెళ్తున్నాను. కానీ వీటన్నింటినీ కచ్చితంగా మిస్ అవుతాను అంటూ పంచుకుంది. మొత్తానికైతే రష్మిక మందన్న త్వరలో తన సినిమా షూటింగ్ సెట్లో అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక ఒకవైపు తన భర్త ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో కలిసి ‘రణబాలి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మరొకవైపు పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మైసాలో కూడా రష్మిక నటిస్తోంది. ఇందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తున్నట్లు ఇటీవల సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ చిత్రానికి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) సంగీతం అందిస్తుండగా.. ఈశ్వరీ రావు, సముద్రఖని, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆఖరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ గా, భార్యగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన్న.. ఇప్పుడు తొలిసారి విలన్ షేడ్స్ ఉన్న అమ్మాయిగా నటించబోతోంది. ప్రముఖ డైరెక్టర్ అట్లీ (Atlee ) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటిస్తున్న ‘రాకా’ సినిమాలో రష్మిక మందన్న విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. మరికొంతమంది హీరోయిన్లు భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ..ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు.