E-Paper
Advertisement

Helicopter crashed: కేదార్‌నాథ్.. కొండల్లో కూలిన హెలికాప్టర్, అసలేం జరిగింది?

Helicopter crashed: కేదార్‌నాథ్.. కొండల్లో కూలిన హెలికాప్టర్, అసలేం జరిగింది?
Advertisement

Helicopter crashed: ఉత్తరాఖండ్‌లో హెలికాఫ్టర్ కూలిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ హెలికాప్టర్.. మరొక దాన్ని తీసుకెళ్లే క్రమంలో కూలిపోయింది. అయితే జనవాసాల మధ్య కాకుండా కొండల్లో కూలిపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్‌లో యాత్రను కొద్దిరోజుల కిందట నిలిపివేశారు అధికారులు. దీంతో హెలికాప్టర్ ద్వారా టూరిస్టులు అక్కడికి వస్తున్నారు. వారి కోసం క్రెస్టల్ హెలికాఫ్టర్‌ను ఉపయోగిస్తున్నారు నిర్వాహకులు. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ దెబ్బతింది.

Advertisement

దాన్ని తరలించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఆర్మీ ఎంఐ 17 ఛాపర్‌ను తెప్పించి, ప్రత్యేకమైన కేబుళ్లతో దాన్ని మరో ప్రదేశానికి తరలించే ప్రయత్నం చేశారు అధికారులు. ఆదివారం ఉదయం కొద్దిదూరం వెళ్లిన తర్వాత కేదార్‌నాథ్- గచౌర్ మధ్య ఎంఐ హెలికాప్టర్‌కు అమర్చిన తీగలు తెలిపోయాయి. కొన్నివేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్ హెలికాఫ్టర్ కొండ లోయలో పడిపోయింది.

ALSO READ: స్పైస్ జెట్ సిబ్బందికి శాలరీ కట్ చేశారు .. 3 నెలలుఇంటికి పంపించారు

Advertisement

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల చాలా ఎత్తు నుండి పడిపోయిందని అంటున్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పడలేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. డ్యామేజ్ అయిన హెలికాప్టర్ మే 24న ల్యాండింగ్ అయినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ శిథిలాలను గుర్తించారు.

 

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×